మొదటి విడత పల్లెప్రగతి పురోగతిని పరిశీలించేందుకు 51 మంది ఉన్నతాధికారులు జనవరి ఒకటి నుంచి ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కలెక్టర్లు, ఇతర బాధ్యతలు నిర్వర్తించిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను ఫ్లయింగ్ స్క్వాడ్స్గా ఎంపిక చేశారు.
జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి నెలాఖరు వరకు ఫ్లయింగ్ స్క్వాడ్స్ గ్రామాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేస్తారు. ఒక్కో అధికారి 12 మండలాల్లో... మండలానికి రెండు గ్రామాల చొప్పున తనిఖీలు చేస్తారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు తదితరాలకు సంబంధించిన పురోగతిని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు.
ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులతో సమావేశమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి... వారికి దిశానిర్ధేశం చేశారు. సీఎం కేసీఆర్ ఆలోచనలు, ప్రణాళికలను వారికి వివరించారు. రెండో విడత పల్లెప్రగతిపైనా జిల్లా కలెక్టర్లతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్ ఎస్కేజోషి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
ఇదీ చదవండి ప్రజాందోళన: గళమెత్తిన అమరావతి మహిళా రైతులు