ETV Bharat / state

'ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు' - కరోనాకు చికిత్స లేదు

కరోనా వైరస్​ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడమే తప్ప, వ్యాధి సోకిన తర్వాత చికిత్స లేదని హైదరాబాద్​ ఫీవర్​ ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలని సూచించారు.

fever hospital doctor says that there is no treatment for corona virus
'కరోనాకు చికిత్స లేదు... అప్రమత్తంగా ఉండాల్సిందే!'
author img

By

Published : Jan 28, 2020, 11:55 AM IST

'ఒక్క కరోనా కేసూ నమోదు కాలేదు'

హైదరాబాద్​లో కరోనా వైరస్​ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఆ వ్యాధి లక్షణాలున్నాయనే అనుమానంతో నలుగురు వ్యక్తులు ఫీవర్​ ఆస్పత్రిలో చేరారు. వారిలో ఇద్దరికి కరోనా లక్షణాలున్నాయని గ్రహించి, వారి సాంపుల్స్​ను పూణెకు పంపించారు. పరీక్షించిన పూణె వైద్య బృందం ఆ వ్యక్తులకు కరోనా సోకలేదని తేల్చింది.

కరోనా కలకలంతో నేడు రాష్ట్రానికి కేంద్ర ఆరోగ్య బృందం చేరుకుంది. ఫీవర్, గాంధీ, ఛాతీ ఆస్పత్రులను సందర్శించనుంది. అనంతరం సచివాలయంలో ఆరోగ్యశాఖ అధికారులతో భేటీకానుంది. కోఠి డీఎంఈ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన అనంతరం సీఎస్​ సోమేశ్​ కుమార్​ను కలిసే అవకాశముంది. ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.