ఆర్టీసీ జేఏసీ సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఆచార్య జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. దీనితో పాటు అమరులైన ఆర్టీసీ కార్మికులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఇక హైదరాబాద్లోని ఎంజీబీఎస్ బస్స్టేషన్లో మహిళా కార్మికులు మౌనదీక్ష చేపట్టారు. ఉదయం పదిన్నరకు ప్రారంభమైన దీక్ష మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొససాగుతుందని మహిళా కార్మికులు పేర్కొన్నారు. ఈ దీక్షా కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో-కన్వీనర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఎలాంటి విపత్తునైనా 'డీఆర్ఎఫ్ ట్రక్కులతో' ఎదుర్కొంటాం: విశ్వజిత్