ETV Bharat / state

'చనిపోయిందనుకునే పాతి పెట్టాలనుకున్నాం'

గురువారం సికింద్రాబాద్ పరిధిలోని జేబీఎస్ బస్టాండు వద్ద పాపను పాతిపెట్టేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యులు నోరు విప్పారు. పాప చనిపోయిందనుకునే పాతి పెట్టాలనుకున్నట్లు వివరించారు.

'చనిపోయిందనుకునే పాతి పెట్టాలనుకున్నాం'
author img

By

Published : Nov 1, 2019, 1:28 PM IST

Updated : Nov 1, 2019, 3:51 PM IST

సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ వద్ద మూడు నెలల పాపను పాతిపెట్టేందుకు యత్నించిన ఘటనపై కుటుంబ సభ్యులు స్పందించారు. పాప చనిపోయిందనుకునే పాపను పూడ్చి పెట్టాలనుకున్నట్లు చిన్నారి బాబాయి తెలిపాడు. కానీ గుంత తవ్వాక పాప కదలడంతో పూడ్చి పెట్టే ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు పేర్కొన్నాడు. మళ్లీ ఆస్పత్రికి తీసుకొద్దామని చూసేలోపే ఎవరో వచ్చి... విషయాన్ని తప్పుగా చెప్పి పత్రికల్లో, టీవీల్లో ప్రచురించారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిజంగానే పాపని వదిలించుకునే వాళ్లమైతే... ఆసుపత్రికి తీసుకొచ్చి ఎందుకు చికిత్స చేయిస్తామని ప్రశ్నించారు. పూర్తిగా విషయం తెలియకుండా ఇలా దుష్ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

'చనిపోయిందనుకునే పాతి పెట్టాలనుకున్నాం'

ఇవీ చూడండి: 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లానొదిలేశాడు'

సికింద్రాబాద్ జేబీఎస్ బస్టాండ్ వద్ద మూడు నెలల పాపను పాతిపెట్టేందుకు యత్నించిన ఘటనపై కుటుంబ సభ్యులు స్పందించారు. పాప చనిపోయిందనుకునే పాపను పూడ్చి పెట్టాలనుకున్నట్లు చిన్నారి బాబాయి తెలిపాడు. కానీ గుంత తవ్వాక పాప కదలడంతో పూడ్చి పెట్టే ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు పేర్కొన్నాడు. మళ్లీ ఆస్పత్రికి తీసుకొద్దామని చూసేలోపే ఎవరో వచ్చి... విషయాన్ని తప్పుగా చెప్పి పత్రికల్లో, టీవీల్లో ప్రచురించారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిజంగానే పాపని వదిలించుకునే వాళ్లమైతే... ఆసుపత్రికి తీసుకొచ్చి ఎందుకు చికిత్స చేయిస్తామని ప్రశ్నించారు. పూర్తిగా విషయం తెలియకుండా ఇలా దుష్ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

'చనిపోయిందనుకునే పాతి పెట్టాలనుకున్నాం'

ఇవీ చూడండి: 'పళ్లెత్తుగా ఉన్నాయని పెళ్లానొదిలేశాడు'

Intro:సికింద్రాబాద్ యాంకర్... నిన్న జేబీఎస్ ప్రాంగణంలో శిశువు కు సంబంధించిన కేసులో శిశువు బాబాయ్ రాజేందర్ మాట్లాడుతూ శిశువును చంపే ఉద్దేశం తమకు లేదని అన్నారు..నీలోఫర్ ఆసుపత్రి నుండి కరీంనగర్ కు వెళుతున్న క్రమంలో ఆటోలో ఉన్న సమయంలో పాప నుండి ఎలాంటి అలికిడి లేకపోవడంతో తమకు అనుమానం వచ్చి శిశువుకు తండ్రికి సమాచారం అందించామని తెలిపారు..సమాచారం అందించిన అనంతరం శిశువు తండ్రి పాప స్థితిని తెలుసుకుని శిశువును అక్కడే పెట్టండి అని వారికి చెప్పడంతో తాము ఆ విధంగా చేసినట్లు వారు వెల్లడించారు..శిశువుకు మర్మాంగాల సమస్య ఉందని శిశువు పై ఆశలు వదిలేసుకున్నమని అన్నారు..శిశువు ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం మరియు ఆమె ఎలాంటి స్పందన లేకపోవడంతో తాము వద్ద ఆగి పెడదామని అనుకున్నట్లు తెలిపారు..ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో శిశువు చికిత్స పొందుతోందని రెండు మూడు రోజుల్లో ఆమె పరిస్థితి మెరుగైన వెంటనే శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు తెలిపినట్లు వారు తెలిపారు ...తమకు శిశువు పట్ల ఎలాంటి చెడు ఉద్దేశం లేదని ఆమెను చంపే ఉద్దేశంతో పూడ్చి పెట్టలేదని అనుకోకుండా ఆమె చనిపోయింది అనుకోని ఆ విధంగా చేసినట్లు వారు వెల్లడించారు ..ప్రస్తుతం శిశువు తల్లి పరిస్థితి కూడా ఆరోగ్యం విషమంగా ఉందని ఆస్పత్రి లో ఉంటున్నానని ఆయన తెలిపారు ...కరీంనగర్ జిల్లా సంఘ పల్లి గ్రామానికి చెందిన రాజు మానస దంపతులు..ఈనెల 28వ తేదీన మానస కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడ మగ తేడా తెలియకుండా మర్మాంగాల వద్ద జెనిటిక్ లోపాలతో కూడుకున్న శిశువుకు జన్మనిచ్చింది..వైద్యుల సూచన మేరకు రాజు అతని తండ్రి తిరుపతి తల్లి తిరుపతమ్మ అదేరోజు శిశువుకు మెరుగైన వైద్యం కోసం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు.. నీలోఫర్ ఆసుపత్రిలో శిశువుకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని, శస్త్ర చికిత్స చేసినప్పటికీ శిశువు బతికే అవకాశాలు తక్కువేనని చెప్పారు..దీంతో రాజు 30వ తేదీన కరీంనగర్ కు తిరిగి వెళ్లగా తిరుపతి తిరుపతమ్మ మరియు రాజు సోదరుడు రాజేందర్ శిశువు తో పాటు నీలోఫర్ లోనే ఉన్నారు..గురువారం రోజు ఉదయం తమన్నా శిశువుకు కరీంనగర్లోని శస్త్రచికిత్స వైద్య0 చేయించుకుంటామని తిరుపతి తిరుపతమ్మ మరియు రాజేందర్ శిశువును డిశ్చార్జ్ చేసుకొని స్వగ్రామానికి బయలుదేరేందుకు ఆటోలో జేబీఎస్ కు తీసుకువచ్చారు..ఈ క్రమంలోనే శిశువులో చలనం లేనట్లుగా గుర్తించినవారు విషయాన్ని రాజుకు చెప్పారు..అయితే నాలుగు రోజుల క్రితం శిశువుకు జన్మనిచ్చిన మానస పరిస్థితి బాగోలేదని ఆమెకు సిజేరియన్ ద్వారా జన్మనివ్వడం వల్ల సమస్యలు తలెత్తాయని ఆమెకు శిశువు విషయం తెలిస్తే మరింత ఆరోగ్యం క్షీణించి ప్రమాదం ఉంటుందని రాజు అతని తల్లిదండ్రులకు సోదరుడికి చెప్పాడు..దీంతో రాజు తల్లిదండ్రులు అతని సోదరుడు రాజేందర్ శిశువును టికెట్ బస్టాప్ లో ఉన్న ఖాళీ స్థలం వద్ద పూడ్చి పెట్టాలని నిర్ణయించుకున్నారు..అదే సమయంలో మూత్రవిసర్జన కోసం వెళ్లిన ఓ ఆటోడ్రైవర్ ఈ విషయాన్ని అంతా గమనించి అక్కడే ఉన్నా రికార్డింగ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడికి చేరుకొని పాప విషయాన్ని ఆరా తీశారు..హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విషయాన్ని తెలుసుకొని శిశువు బతికే ఉందన్న విషయాన్ని గమనించి శిశువును వెంటనే గాంధీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.. శిశువు ఆలనాపాలన చూసుకునేందుకు వారి కుటుంబ సభ్యులను కూడా అక్కడే గాంధీ ఆస్పత్రిలో ఉంచి దర్యాప్తు ప్రారంభించారు...
బైట్ రాజేందర్ శిశువు బాబాయ్ .Body:VamshiConclusion:7032401099
Last Updated : Nov 1, 2019, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.