ETV Bharat / state

ఆనందాల లోగిలి.. కన్నీటి మజిలీ... - ఉత్తమ తహసీల్దార్

తల్లిదండ్రులు, సోదరి, భర్త, తాను సైతం ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు ఉన్నారు.మొదటి ప్రయత్నం​లోనే గ్రూప్​-2 ఉద్యోగం సాధించి డిప్యూటీ తహసీల్దార్​గా బాధ్యతలు చేపట్టారు. 2017 లో ఉత్తమ అధికారిణిగా ప్రశంసాపత్రం అందుకున్నారు. ఇది విజయారెడ్డి ప్రస్థానం.

ఆనందాల లోగిలిలో కన్నీటి మజిలీ...
author img

By

Published : Nov 5, 2019, 9:38 AM IST

Updated : Nov 5, 2019, 11:21 AM IST

ఎంతో హాయిగా సాగుతున్న జీవనం... మంచి ఉద్యోగం.. మండల స్థాయి అధికారి హోదా.. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు.. భర్త ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడు.. ఇద్దరు పిల్లలు. ఇలా ఆనందంగా సాగిపోతున్న కుటుంబం విజయారెడ్డిది. ఆమె దారుణహత్యకు గురవ్వడంతో ఆ కుటుంబ ఆనందం మంటల్లో కాలి బూడిదయ్యింది. అబ్దుల్లాపూర్​ మెట్​ తహసీల్దార్​ సీహెచ్​ విజయారెడ్డి కుటుంబంలో అందరూ విద్యాధికులే.

కుటుంబం అంతా విద్యాధికులే...

నల్గొండ జిల్లా నకిరేకల్​ మండలం పెరికెకొండారం గ్రామానికి చెందిన సీహెచ్​ లింగారెడ్డి వినోద దంపతుల కుమార్తె విజయారెడ్డి. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయులే. ఆమె సోదరి సంధ్యారాణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. విజయారెడ్డి తొలి ప్రయత్నంలోనే డీఎస్సీ ద్వారా ఎస్జీటీగా ఉద్యోగం సాధించి నల్గొండ జిల్లా సంస్థాన్​ నారాయణపురంలో కొంతకాలం ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు.

ఉత్తమ తహసీల్దార్​గా ప్రశంస...

అనంతరం మొదటి ప్రయత్నంలోనే 2009లో గ్రూపు-2 పరీక్షలు రాసి డిప్యూటీ తహసీల్దారుగా ఎంపికయ్యారు. జిల్లాల విభజన తర్వాత రంగారెడ్డి జిల్లాకు వచ్చి అబ్దుల్లాపూర్​మెట్​ మండల తొలి తహసీల్దార్​గా 2016లో బాధ్యతలు చేపట్టారు. మూడేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు. 2017లో జిల్లాస్థాయి ఉత్తమ తహసీల్దార్​గా ఎంపికై ప్రశంసాపత్రం అందుకున్నారు. విజయారెడ్డికి మునుగోడు ప్రాంతానికి చెందిన పుట్టా సుభాష్​రెడ్డితో వివాహమైంది. భర్త హయత్​నగర్​ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె కుటుంబంతో చైత్యపురి సమీపంలోని గ్రీన్​హిల్స్​ కాలనీలో నివాసం ఉంటోంది. విజయ హత్య విషయం తెలుకుని ఆమె భర్త సుభాష్​రెడ్డి కార్యాలయానికి చేరుకొని మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు. అనంతరం అక్కడికి చేరుకున్న విజయారెడ్డి తల్లి వినోద గుండెలు 'బాదుకుంటూ అమ్మా.. నిన్ను పెద్ద చదువులు చదివించింది ఇందుకేనా..?' అంటూ రోదించారు.

ఇదీ చూడండి: తహసీల్దార్​ని తగలబెట్టేశాడు... కారణం ఇదే..!

Tg_hyd_09_05_rtc_employees_joinings_av_3182388 Reporter: sripathi.srinivas ( )ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశం ఇవాళ అర్ధరాత్రితో ముగిసిపోతుంది. సోమవారం సాయంత్రానికి 11మంది కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోల్లో చేరినట్లు అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ లో నలుగురు, మెదక్ లో నలుగురు, కరీంనగర్ లో ముగ్గురు కార్మికులు విధుల్లో చేరారు. ఇవాళ అర్ధరాత్రితో సీఎం ఇచ్చిన గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈరోజు కూడా కార్మికులు విధుల్లో చేరుతారని అధికారులు అంచనావేస్తున్నారు. ఆర్టీసీ విధుల్లో చేరాలనుకున్న కార్మికులు జిల్లా కలెక్టర్,ఎస్పీ, ఆర్డీఓ, బస్ భవన్, ఆర్టీసీ రీజినల్ మేనేజర్, డిపో మేనేజర్ కార్యాలయాల్లో,డీఎస్పీ కార్యాలయాల్లో కూడా చేరవచ్చని ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎండీ పేర్కొన్నారు. Look...
Last Updated : Nov 5, 2019, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.