'అవసరమైతే అధికారం కోల్పోవడానికైనా సిద్ధం' - కేటీఆర్
సీఏఏ అంశంపై పార్లమెంట్ వేదికగా తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మత ప్రాతిపదికన వ్యహరిస్తామంటే దేశానికి మంచిది కాదని పేర్కొన్నారు. తాము గతంలో ఏదైతే చెప్పామో ప్రాంతీయ శక్తులు బలంగా ఉద్భవిస్తాయని.. అది ఇప్పుడు కనపడుతోందన్నారు. తమ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసేనని కేటీఆర్ స్పష్టం చేశారు. 1990లో తెలంగాణలో భాజపా పరిస్థితి ఎలా ఉందో... ప్రస్తుతం అలాగే ఉందన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాల వారితో స్నేహ పూర్వకంగా ఉండాలన్నదే తమ విధానమన్నారు. ముఖ్యమంత్రి పదవిపై తనదైన శైలిలో సమాధానం చెప్పిన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
ktr