స్వైన్ ఫ్లూని సమర్థంగా ఎదుర్కొంనేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వైన్ ఫ్లూ కోసం 500 పడకలతో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల డీఎంహెచ్ఓలు, ప్రాజెక్టు డైరెక్టర్లు, బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లు సహా పలువురు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
స్వైన్ ఫ్లూ సహా.. ఉస్మానియా ఆస్పత్రి ఆధునికీకరణపై చర్చించారు. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం కోసం రూ.23కోట్లు మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు. స్వైన్ ఫ్లూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈటల తెలిపారు. చిన్న చిన్న జలుబు, దగ్గుకు భయపడి ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులుతీయకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను తీసుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: ముంబయి దాడికి 11 ఏళ్లు- అమరులకు ఘన నివాళులు