ETV Bharat / state

ప్రతి ఒక్కరూ.. ఈచ్ వన్ టీచ్ వన్ ప్రతిన తీసుకోవాలి - ఈచ్ వన్ టీచ్ వన్ ప్రతిన తీసుకోవాలి

ప్రపంచంలోనే పేరొందిన బహుళజాతి సంస్థల పరిశోధన కేంద్రాలు హైదరాబాద్‌లో కొలువయ్యాయి. సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల ఎగుమతిలో బెంగళూరుతో భాగ్యనగరం పోటీ పడుతోంది. మిషన్‌ భగీరథ, కాళేశ్వరంలాంటి భారీ పథకాలు మకుటాయమానంగా నిలుస్తున్నాయి. ఇవన్నీ ఘనంగా ఉన్నా... రాష్ట్రాన్ని నిరక్షరాస్యత అపకీర్తి నీడలా వెంటాడుతోంది. దీన్ని వదిలించుకోవడానికి సీఎం కేసీఆర్‌ ‘ఈచ్‌ వన్‌... టీచ్‌ వన్‌’ నినాదమిచ్చారు. రాష్ట్రాన్ని చదువులమ్మ కోవెలగా తీర్చిదిద్దే కార్యాచరణ రూపకల్పనకు పిలుపునిచ్చారు. ఈ మహత్కార్యాన్ని సాధించడమెలా... ఎవరెవరు బాధ్యత తీసుకోవాలి... మనకంటే ముందున్న రాష్ట్రాలు ఏం చేశాయి...???

Education System in Telangana
ప్రతి ఒక్కరూ.. ఈచ్ వన్ టీచ్ వన్ ప్రతిన తీసుకోవాలి
author img

By

Published : Jan 4, 2020, 7:18 AM IST

తెలంగాణలో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి యుద్ధప్రాతిపదికన పనిచేయాలంటూ స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంలో ఇప్పటికే విజయం సాధించిన రాష్ట్రాల విధానాలను అనుసరిస్తే ఏడాదిలో 4% అక్షరాస్యత పెరిగే అవకాశముందని గణాంకాలు చెబుతున్నాయి.

కలవరపెడుతున్న గణంకాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన 2011 జనాభా లెక్కల ప్రకారం... తెలంగాణలో 1.04 కోట్ల మంది నిరక్షరాస్యులున్నారు. 66.46% అక్షరాస్యతతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోలిస్తే 32వ స్థానంలో నిలిచింది. ప్రపంచసగటు(86%)కు ఇది ఎంతో దూరం. యూనిసెఫ్‌ నిబంధనల ప్రకారం 6-14 సంవత్సరాల లోపు పిల్లల్లో ఒక్కరు కూడా నిరక్షరాస్యులు ఉండొద్దు. కానీ... తెలంగాణలో 20% మంది ఇంకా బడికి దూరంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి వారికోసమే 2014 నుంచి రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేస్తున్నా... ఇటీవలి జాతీయ నమూనా సర్వే మన అక్షరాస్యత అంచనా 73% మాత్రమేనంటూ వెల్లడించడం గమనార్హం. ముఖ్యంగా ఎస్సీల్లో 49.50%, ఎస్టీల్లో 58.90% మాత్రమే చదువుకున్న వారుండటం కలవరపరుస్తోంది. సమస్య పరిష్కారానికి 50-70, ఆపైన వయసున్న వారిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలకు రూపకల్పన చేయాల్సి ఉంది.

ప్రభుత్వ సంకల్పం... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర ప్రభుత్వం 1988లో జాతీయ అక్షరాస్యత ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈక్రమంలో 1991-2001 మధ్య ఉమ్మడి రాష్ట్రంలోనూ అక్షరాస్యత కార్యక్రమాలను ఉద్ధృతంగా అమలు చేశారు. కలెక్టర్లకు బాధ్యత అప్పగించి వయోజన విద్యపై నిరంతర అనుశీలన చేయడంతో ఏడాదికి సగటున 1.6 శాతం చొప్పున ఆ దశాబ్దం మొత్తంగా 16 శాతం అక్షరాస్యత పెరిగింది.

వాలంటీర్ల కార్యదక్షత... త్రిపుర

త్రిపుర 2001లో జాతీయ స్థాయిలో 12వ స్థానంలో ఉండేది. 2011 వచ్చేసరికి 87.75 శాతంతో నాల్గో స్థానానికి చేరుకుంది. మరింత మెరుగయ్యేందుకు గ్రామ పంచాయతీలు, వాలంటీర్లతో ఉద్యమం నడిపారు. రాజకీయ పార్టీల కార్యకర్తలూ సహకరించారు. దాంతో ఇప్పుడు అక్కడ 97% అక్షరాస్యత సాధించినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వయోజనులు అక్షరాలను మరచిపోకుండా నిరంతర విద్యను కొనసాగిస్తున్నారు. అందుకే 2016లో అప్పటి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి త్రిపురలో పర్యటించి విద్యావిధానాలపై అధ్యయనం చేశారు.

ఊరూవాడా ‘అక్షర లక్ష్యం’... కేరళ

కేరళ అక్షరాస్యతలో దేశంలోనే ముందుంది. 2011లో 93.91% నమోదైనా... ఇంకా 18 లక్షల మంది నిరక్షరాస్యులను గుర్తించారు. వారి కోసం ‘అక్షర లక్ష్యం’ పథకానికి రూపకల్పన చేశారు. మొదటి విడతలో... ఒక్కో బృందంలో 10-15 మందిని పెట్టి వంద గంటలపాటు అక్షరాలు నేర్పించారు. వీరికి పరీక్షలు నిర్వహించగా 90-100 ఏళ్లున్న వృద్ధులూ ఉత్సాహంగా తరలివచ్చారు. ఇక్కడా ఉత్తీర్ణత సాధించని వారిని రెండోవిడతలో పంచాయతీలు, పట్టణాలు, నగరాల వారీగా ఎంపిక చేసి, చదువు నేర్పించారు. ఫలితంగా తమ అక్షరాస్యత 96.69 శాతానికి చేరినట్లు కేరళ ప్రకటించింది.

* అక్షరాస్యతలో మనకంటే వెనకుండే మధ్యప్రదేశ్‌ ప్రాథమిక విద్యపై గురిపెట్టడంతో 2011లో నాలుగు మెట్లుపైకి చేరుకుంది.
* చత్తీస్‌గఢ్‌ సైతం వయోజన విద్య(15, ఆపై వయసు)పై దృష్టి కేంద్రీకరించి అక్షరాస్యత శాతాన్ని బాగా పెంచుకుంటోంది.

Intro:సికింద్రాబాద్ యాంకర్ ..ప్రజలకు సేవ చేసే వాడే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు..మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తెరాస సన్నాహక సభ నిర్వహించారు..ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్థిక మంత్రి హరీష్ రావు మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు..సన్నాహక సభకు భారీ ఎత్తున తెరాస శ్రేణులు తరలివచ్చారు..మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల విషయంలో ముందు ఉందని అన్నారు..నిరుపేద ఆడపిల్లలకు వివాహానికి లక్ష 16 వేల రూపాయలు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పేరుతో అందిస్తూ వారికి తోడుగా నిలుస్తుంది అని అన్నారు..మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అంటే బృహత్తర కార్యక్రమం వల్ల తెలంగాణలోని ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు..గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే ప్రజా సమస్యలు మరింత జటిలంగా మారాయని అన్నారు..అధికారంలో ఉన్న తెరాసకి మరోసారి ఓటు వేసి మున్సిపల్ ఎన్నికలలో భారీ విజయాన్ని అందించాలని ఆయన కోరారు..మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే వారి సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ పార్టీలో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన తెలిపారు..దళారీ వ్యవస్థ లేకుండా పెన్షన్ విధానాన్ని అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం మొదటి స్థానంలో నిలిచిందని ఆయన కితాబిచ్చారు..పేద వారు నివసిస్తున్న జవహర్ నగర్ గడ్డపై మరింత అభివృద్ధి జరగాలంటే తెరాస వల్లనే సాధ్యమవుతుందని అన్నారు..జవహర్ నగర్ కార్పొరేషన్ అభివృద్ధికి 28 కోట్ల రూపాయలను మున్సిపల్ మంత్రి కేటీఆర్ కేటాయించారని ఆయన తెలిపారు..పార్టీలోని ఆశావహులు క్రికెట్ రాణి సందర్భంలో నిరుత్సాహపడకుండా పార్టీ కోసం వెన్నుదన్నుగా నిలిచి గెలుపులో తమ వంతు కృషి చేయాలని వారికి భవిష్యత్తులో నామినేటెడ్ పోస్టుల్లో పెద్ద పీట వేస్తామని అన్నారు..నగర శివారులో నిర్మిస్తున్న లక్ష రెండు పడక గదుల ఇల్లు పూర్తయ్యే దశలో చేరుకున్నాయని వాటిని లబ్ధిదారులకు అందించేందుకు కృషి చేస్తామన్నారు..కాంగ్రెస్ బిజెపి పార్టీలకు ఓటు వేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదని ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్నా తెరాస కు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు..ప్రస్తుత మున్సిపల్ చట్టాలు మారాయని వాటికి అనుగుణంగా పోటీదారులు నడుచుకోవాలని అన్నారు..ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా నాయకులకు ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు..
Byte..Harish rao..ministerBody:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.