హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని నాలుగు ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నిర్వహించారు. ఈ తనిఖీల్లో 62 మంది మందుబాబులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 42 కార్లు, 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కొంతమంది మందు బాబులు శ్వాస పరీక్షలకు నిరాకరిస్తూ... పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరికొందరు తప్పించుకునేందుకు యత్నించగా.. వెంబడించి పట్టుకున్నారు. పలువురు మహిళలు మద్యం సేవించి దొరికారు. వీరందరికి సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించి మంగళవారం కోర్టులో హజరుపర్చనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండిః మృగరాజు ముందు మందుబాబు వేషాలు!