హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ వద్ద తాగు నీరు వృథాగా పోతోంది. ఇళ్లకు సరఫరా చేసే పైపుల నుంచి లీకైన నీరు రహదారి గుండా ప్రవహిస్తూ రోడ్డుపై నిలుస్తోంది. పోలీస్ స్టేషన్ వద్ద లీకవుతున్న నీరు ప్రశాంత్‌నగర్‌లోని కనకదుర్గా దేవాలయం వరకు వెళ్తోంది. కొన్ని రోజులుగా తాగునీరు వృథా అవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. తక్షణమే స్పందించి నీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో జనాభా కంటే.. ఆధార్ కార్డులే ఎక్కువట.?