ETV Bharat / state

ట్రైనీ ఐపీఎస్​పై వరకట్న వేధింపుల కేసు

author img

By

Published : Oct 29, 2019, 4:15 PM IST

Updated : Oct 29, 2019, 4:50 PM IST

తొమ్మిదేళ్లు చెప్పలేనంత ప్రేమ పంచాక పెళ్లి చేసుకున్నాడు. భర్త మీద నమ్మకంతో అతన్ని ఉద్యోగం చేయనివ్వకుండా ఐపీఎస్​ని చేసింది. కానీ ఉద్యోగం వచ్చాక కట్నం తీసుకొస్తేనే కాపురం చేస్తానంటూ వేధింపులకు గురిచేస్తున్నాడని ఆ మహిళ రంగారెడ్డి జిల్లా కీసరలోని జవహర్​నగర్​ పీఎస్​లో ఫిర్యాదు చేసింది.

DOWRY HARASSMENT CASE BOOKED ON TRAINEE IAS IN RANGA REDDY KEESARA

వారిద్దరికీ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నప్పటి నుంచి పరిచయం. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తొమ్మిదేళ్ల తర్వాత మహేశ్​ను పెళ్లి చేసుకోమని అడగగా ఇంట్లో ఎలా ఒప్పిస్తావంటూ ఆమె ప్రశ్నించింది. తాను ఐపీఎస్​గా సెలెక్ట్​ అయితే ఇంట్లో వారి అంగీకారం లభిస్తుందని చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఏడాది తర్వాత మహేష్​ ఐపీఎస్​గా ఎంపికయ్యాడు. అప్పుడే అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని బాధితురాలు వాపోతోంది. కట్నం ఇవ్వాలంటూ వేధించడం ప్రారంభించాడని ఆరోపించింది. అదనపు కట్నం తీసుకొస్తేనే కాపురం చేస్తానని లేకపోతే వేరే అమ్మాయిని వివాహమాడతానని ఆమెను బెదిరించాడని చెబుతూ...రంగారెడ్డి జిల్లా కీసరలోని జవహర్​నగర్​ పీఎస్​లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. మహేశ్​ రెడ్డిపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి: జీవితంలో రాణించలేనేమోనని​ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

Last Updated : Oct 29, 2019, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.