దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జస్టిస్ ఫర్ దిశకు న్యాయం చేయాలని మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫీల్మ్నగర్లోని ఎఫ్‌ఎన్‌సీసీలో సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కథానాయకులు వెంకటేశ్, మురళీమోహన్, తమ్మారెడ్డి భరద్వాజ, శివాజీరాజా, రాజశేఖర్, జీవిత, సీ కళ్యాణ్, శివారెడ్డి, హేమా సినీ రంగానికి చెందిన పలువురు పాల్గొని దిశకు ఘనంగా నివాళులు అర్పించారు. దిశకు, వారికి కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని వేడుకున్నారు.
ఏ అమ్మాయికి జరగకుండా..
దిశకు జరిగిన అన్యాయం మరో ఏ అమ్మాయికి జరగకుండా నిందుతులకు వెంటనే ఉరి శిక్ష వేయాలని, లేదంటే ఎన్‌కౌంటర్ చేయాలని సినీ నటుడు మురళీమోహన్ డిమాండ్ చేశారు. తప్పు చేసిన ప్రతి వాడు దేశంలో ఎలాంటి భయం లేకుండా తిరుగుతున్నాడని.. వారికి భయం కలిగే విధంగా శిక్షలు వేయాలన్నారు.
నివాళర్పించడం కాదు..
ఇలాంటి ఘటనలు జరిగిన తరువాత కేవలం సంతాపసభలు, నివాళర్పించడం కాదు, చివరి వరకు పోరాటం చేసి నిందుతులకు శిక్ష పడే విధంగా చేయాలని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. దిశ కేసులో నిందితులను ఇవాళ రాత్రి ఎన్‌కౌంటర్ చేసిన నాకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన పేర్కొన్నారు.
అమ్మాయిలతో పాటు అబ్బాయిలను
నేటి తరం యువతకు చట్టాలంటే భయం లేదు, సమాజమంటే సిగ్గులేదని సినీ రచయిత గుమ్మడి గోపాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం సమాజంలో అమ్మాయిలతో పాటు అబ్బాయిలను సక్రమైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, సమాజంపై ఉందన్నారు. సినీ పరిశ్రమపై నేడు సోషల్‌మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సినీ నటి జీవిత అవేదన వ్యక్తం చేశారు. దిశకు శిక్షపడే వరకు దిశ కుటుంబ సభ్యులకు సినీపరిశ్రమ అండగా ఉంటుందని జీవిత తెలిపారు.
దిశ సంతాప సభ అనంతరం మా అసోసియేషన్ నాలుగు తీర్మాణాలను చేసింది. దిశ వంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు నిందితులకు కఠిన శిక్ష వేయాలని, పాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఒకటి, రెండు నెలల లోపే శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళల కోసం ప్రతి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలన్నారు.
ఇదీ చూడండి : 'వసతి వణుకుతోంది' కథనంపై హైకోర్టు స్పందన