ETV Bharat / state

కీలక ఆధారాల వేటలో పోలీసు బృందాలు...

దేశమంతటా సంచలనం సృష్టించిన దిశ ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పలు బృందాలుగా ఏర్పడిన పోలీసు అధికారులు... కీలక ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. క్లూస్ టీం బృందాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు సిద్ధం చేయటంలో తలమునకలయ్యారు.

DISHA CASE ENQUIRY SPEEDUP
DISHA CASE ENQUIRY SPEEDUP
author img

By

Published : Dec 5, 2019, 2:31 PM IST

Updated : Dec 5, 2019, 3:11 PM IST

దిశ ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేరుగా కేసును పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డితో పాటు.. నలుగురు అదనపు డీసీపీల ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. బృందాల్లో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు. ఒక్కో బృందానికి ఒక్కో అధికారి నేతృత్వం వహిస్తున్నారు. క్లూస్ టీం బృందాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, నిందితుల విచారణకు సంబంధించి ఇలా ఒక్కో అంశాన్ని ఒక్కో టీం పర్యవేక్షించనుంది.

కీలకం కానున్న ఫోరెన్సిక్​ ఆధారాలు...

ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు.... ఫోరెన్సిక్ అధికారులు ఇచ్చే నివేదిక కేసులో కీలకం కానుంది. దిశను అత్యాచారం చేసిన ఘటనా స్థలంలో పోలీసులు ఇప్పటికే... దిశకు చెందిన లోదుస్తులు, గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో నిందితులకు సంబంధించిన డీఎన్ఏ ఆనవాళ్లను సేకరించి సరిపోల్చనున్నారు. చటాన్​పల్లిలో మృతదేహాన్ని తగులబెట్టిన చోట దిశ బంగారు గొలుసు, జీన్స్ ప్యాంటు ముక్క లభించాయి.

వీలైనంత తొందరగా...

ఫాస్ట్​ట్రాక్ కోర్టు ఏర్పాటు కానున్న తరుణంలో విచారణ వేగవంతమవుతుంది. పోలీసులు సేకరించిన ఆధారాలు, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును న్యాయస్థానానికి వీలైనంత తొందరలో ఇచ్చేందుకు దర్యాప్తు బృందం కృషి చేస్తోంది.

ఇదీ చూడండి: అత్యాచార బాధితురాలికి నిప్పు అంటించిన రాక్షసులు

TG_HYD11_05_DISHA_CASE_ENQUIRY_AV_3181326 రిపోర్టర్- శ్రీకాంత్ ( ) దిశ ఘటనలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేరుగా కేసును పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డితో పాటు.. నలుగురు అదనపు డీసీపీల ఆధ్వర్యంలో బృందాలు ఏర్పాటు చేశారు. దర్యాప్తు బృందంలో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు. ఒక్కో బృందానికి ఒక్కో అధికారి నేతృత్వం వహిస్తున్నారు. క్లూస్ టీం బృందాలు, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు, నిందితుల విచారణకు సంబందించి ఇలా ఒక్కో అంశాన్ని ఒక్కో దర్యాప్తు బృందం పర్యవేక్షించనుంది. ఇప్పటికే ఈ కేసులో నలుగురు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు. పోస్టుమార్టం నివేదికతో పాటు.... ఫోరెన్సిక్ అధికారులు ఇచ్చే నివేదిక కేసులో కీలకం కానుంది. దిశను అత్యాచారం చేసిన తొండుపల్లి జంక్షన్ సంఘటనా స్థలంలో పోలీసులు ఇప్పటికే... దిశకు చెందిన లోదుస్తులు, ఆమె గుర్తింపు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపనున్నారు. వీటిలో నిందితులకు సంబంధించిన డీఎన్ఏ ఆనవాళ్లు లభిస్తే..... నిందితుల నుంచి డీఎన్ఏ సేకరించి సరిపోల్చనున్నారు. కేసులో ఇవి చాలా కీలకం కానున్నాయి. చటాన్ పల్లిలో మృతదేహాన్ని తగులబెట్టిన చోట దిశ బంగారు గొలుసు, జీన్స్ పాంటు ముక్క లభించాయి. వీటన్నింటిని ఇప్పటికే క్లూస్ టీం సేకరించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు కానున్న తరుణంలో విచారణ వేగవంతమవుతుంది. పోలీసులు సేకరించిన ఆధారాలు, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టును న్యాయస్థానానికి వీలైనంత తొందరలో ఇచ్చేందుకు దర్యాప్తు బృందం కృషి చేస్తోంది.
Last Updated : Dec 5, 2019, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.