హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరో డెక్కన్ హాట్-2019 జాతీయ స్థాయి ప్రదర్శనను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రారంభించారు. ఆన్‌లైన్ విధానం అంటే ఆమోజాన్ వంటి సంస్థలే కాదని, నాబార్డ్ వంటి సంస్థలు సైతం ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టాలని ఆయన కోరారు.
నాబార్డ్ వంటి సంస్థకు ఆ సామర్ధ్యం ఉందని, త్వరలోనే చేతివృత్తి ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి మార్కెట్ వస్తుందని ఎస్కే జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ విశిష్టత అని ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన మినీ ఇండియాను తలపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నాబార్డ్, బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఏఎస్సై ఆత్మహత్యాయత్నం.. వేధింపులే కారణమా!?