ETV Bharat / state

సైబర్ క్రైం ముఠాను పట్టుకోవడం దేశంలోనే మొదటిసారి: సజ్జనార్​

ఈ-కామర్స్​ నుంచే డేటాను సేకరించి మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యులు ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ సైబర్​ క్రైం ముఠాను పట్టుకోవడం దేశంలోనే ఇది మొదటిసారి అని సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ పేర్కొన్నారు.

సీపీ సజ్జనార్​
దేశంలోనే మొదటిసారి
author img

By

Published : Jan 3, 2020, 1:51 PM IST

దేశంలోనే మొదటిసారి: సీపీ సజ్జనార్​

ఈ-కామర్స్‌లో మరో మోసాన్ని సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేశారు. ఈ-కామర్స్​ నుంచి డేటాను సేకరించి అక్రమాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. బిహార్​లోని కబీర్​పూర్​కి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కామర్స్​లో సేకరించిన డేటా ఆధారంగా వినియోగదారులకు బహుమతుల పేరుతో మోసాలు చేసినట్లు సైబరాబాద్​ సీపీ సజ్జనార్​ తెలిపారు.

స్నాప్​డీల్​, క్లబ్​ ఫ్యాక్టరీ, అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ లాంటి ప్రముఖ సంస్థల నుంచి డేటా సేకరించి బహుమతులు గెలుచుకున్నారని సందేశం పంపి మోసాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. గతేడాది నవంబర్​ నెలలో వచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేశామన్నారు. సైబర్​ క్రైమ్​ ముఠాను పట్టుకోవడం దేశంలోనే తొలిసారి అని సజ్జనార్​ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: ఖాతాలో నుంచి డబ్బులు పోయాయని నర్సు ఆత్మహత్య

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.