ETV Bharat / state

మొక్కల పెంపకం ఉద్యమంలా సాగాలి: మిథాలీ

author img

By

Published : Dec 22, 2019, 1:30 PM IST

Updated : Dec 22, 2019, 3:02 PM IST

మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని  భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అన్నారు. తూర్పు మండలం డీసీపీ ఎం.రమేశ్  నుంచి గ్రీన్​ ఛాలెంజ్​ స్వీకరించిన ఆమె తన నివాసంలో మొక్కలు నాటారు.

cricketer mithaliraj takes green challenge
గ్రీన్​ ఛాలెంజ్​​ను స్వీకరించిన మిథాలీ

గ్రీన్ ఛాలెంజ్​లో భాగంగా తన నివాసం వద్ద భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ మొక్కలు నాటారు. మొక్కలు నాటడం ప్రతిఒక్కరూ ఉద్యమంలా చేపట్టి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని సూచించారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. బీసీసీఐ ఛైర్మన్​ సౌరవ్​ గంగూలీ, సినీనటి కాజల్​ అగర్వాల్​, ప్రముఖ వెంచర్​ క్యాపటలిస్ట్​ వాణీ కోలా, ప్రముఖ క్రీడా పాత్రికేయుడు బొరియా మజుందర్​కు మిథాలీ గ్రీన్ ​సవాల్​ విసిరారు.

గ్రీన్​ ఛాలెంజ్​​ను స్వీకరించిన మిథాలీ

ఇదీ చూడండి: ఆకట్టుకున్న కంబైన్డ్​ పాసింగ్​ పరేడ్​.. విమానాల విన్యాసాలు

Intro:సికింద్రాబాద్ యాంకర్..పచ్చని చెట్లు లేకపోవడంతో సమతుల వాతావరణ0 దెబ్బతింటుందని మొక్కలను నాటాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రముఖ భారత మహిళ క్రికెటర్ మిథాలీ రాజ్ స్పష్టంచేశారు..గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా తన నివాసం వద్ద భారత మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ మొక్కలను నాటారు..మొక్కలను నాటి వాటికి నీటిని పోసి నాటిన మొక్క తో సెల్ఫీ దిగారు..మిథాలీ రాజ్ మాట్లాడుతూ వాతావరణం కలుషితమవుతున్న ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమం లాగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడాలని ఆమె కోరారు..కాలాల్లో మార్పుల మూలంగా పర్యావరణ పరిస్థితులు కూడా మారాయని ఆమె అన్నారు..సమాజంలోని ప్రతి ఒక్కరూ చొరవ తీసుకొని మొక్కలను నాటేందుకు కృషి చేయాలని ఆమె కోరారు..ఈస్ట్ జోన్ డిసిపి రమేష్ విసిరిన గ్రీన్ చాలెంజ్ స్వీకరించి తాను మొక్కలు నాటినట్లు వెల్లడించారు..ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా లక్షల సంఖ్యలో మొక్కలు నాటితే పర్యావరణం సమతులంగా ఉంటుందని ఆమె వెల్లడించారు..మొక్కలు నాటడం వల్ల రాబోయే తరాలవారికి పర్యావరణం విషయంలో కాపాడిన వారము అవుతాము అని ఆమె పేర్కొన్నారు..రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో బాగుందని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు..
బైట్ మిథాలీ రాజ్ భారత మహిళా క్రికెటర్Body:VamshiConclusion:7032401099
Last Updated : Dec 22, 2019, 3:02 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.