చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. మహమ్మారి వేగంగా విస్తరిస్తున్నందున హైదరాబాద్ నగరం అప్రమత్తమైంది. తెలంగాణ డీఎంఈ డాక్టర్ రమేష్ రెడ్డి ఆదేశాల సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక ఐసోలాషన్ వార్డును ఏర్పాటు చేసినట్లు గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ తెలిపారు.
ఫీవర్ హాస్పిటల్కు వచ్చే కేసులు కూడా ఇక్కడికి పంపిస్తే వైద్య పరీక్షలు చేస్తామని డాక్టర్ శ్రవణ్ తెలిపారు. ఈరోజు నుంచి గాంధీ కరోనా వైరస్ వార్డుకు కొత్త నోడల్ అధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి నియమించినట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 10 మంచాలు సిద్ధంగా ఉంచినట్లు పేర్కన్నారు. ఒకవేళ వైరస్ రాష్ట్రంలో వ్యాప్తి చెందే పరిస్థితి ఉంటే వెంటనే వారికి ఐసోలేషన్ ద్వారా చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లను చేశామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.
ఇవీ చూడండి:రోనా కలకలం: ముంబయిలో నాలుగో కేసు!