ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ గాంధీ ఆస్పత్రి 4వ తరగతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ఆసుపత్రి అవరణలో ఔట్ సోర్సింగ్, సెక్యూరిటీ, పారిశుద్ద్య కార్మికులు,పేషెంట్ కేర్ వర్కర్లు బైఠాయించారు. గత జులై మాసంలో సమ్మె సందర్భంగా ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
జీతాలు పెంచినట్లు చెప్పిన ప్రభుత్వం మూడు నెలలు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదని ఉద్యోగులు అవేదన వ్యక్తం చేశారు. పెంచిన జీతాలు, కరోనా స్పెషల్ అలవెన్స్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు ఇవ్వాలని కోరారు. రోజుకు 300రూపాయల ఇన్సెంటివ్ ఇస్తామన్న హామీని అమలు చేయాలన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 2,166 కరోనా కేసులు, 10 మరణాలు