ETV Bharat / state

గులాంనబీ ఆజాద్​ ఎదుటే కాంగ్రెస్​ సీనియర్ల రగడ - shabbir ali

పార్టీలో అసలైన సీనియర్లకు న్యాయం జరగడం లేదంటూ గాంధీభవన్​లో గులాంనబీ ఆజాద్​ ఎదుటే కాంగ్రెస్​ ​ నేతలు వీహెచ్​, షబ్బీర్​ అలీ వాగ్వాదానికి దిగారు.

గులాంనబీ ఆజాద్​ ఎదుటే కాంగ్రెస్​ సీనియర్ల రగడ
author img

By

Published : Nov 5, 2019, 5:12 PM IST

Updated : Nov 5, 2019, 6:47 PM IST

గాంధీభవన్​లో ఇద్దరు సీనియర్​ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఏఐసీసీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఎదుటే మాజీ మంత్రి షబ్బీర్ అలీ, వి.హనుమంతరావు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా ఇద్దరు నాయకులు గట్టిగా అరుచుకుంటూ ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో దూషణలకు దిగారు. ఇదే సమయంలో అక్కడున్న నాయకులంతా వారికి సర్దిచెప్పారు.

మీడియా సమావేశం ముగించుకుని బయటకు వచ్చిన గులాం నబీ ఆజాద్‌ను కలిసిన వీహెచ్... రేవంత్ రెడ్డి లాంటి వాళ్లకు కొందరు సీనియర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. తమలాంటి సీనియర్‌లకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఆజాద్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడే ఉన్న షబ్బీర్ అలీ తీవ్రంగా స్పందించటం వల్ల ఇరువురి నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

ఇవీ చూడండి: సీఎం డెడ్​లైన్​... భవిష్యత్​ కార్యాచరణపై ఐకాస చర్చలు

Last Updated : Nov 5, 2019, 6:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.