భాజపా ప్రభుత్వం గాంధీ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్సీ కుంతియా ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లఖ్‌నవూలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ 135 ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనడానికొచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పట్ల పోలీసులు అనుచిత ప్రవర్తనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎస్పీజీ భద్రతను తొలగించిన భాజపా సర్కారు... తాజాగా పోలీసులు అనుచిత వైఖరిని ప్రదర్శించారని ధ్వజమెత్తారు. ప్రజాదరణ కలిగిన మహిళా నేతపైన పోలీసులు ఇలా ప్రవర్తించడం హేయమైన చర్యని అన్నారు.
ఇదీ చూడండి: అదృశ్యాలపై మానవ హక్కుల కమిషన్ సుమోటో కేసు