ETV Bharat / state

డీసీపీ అవినాష్​ మహంతిపై ఓ వ్యక్తి ఫిర్యాదు - డీసీపీ అవినాష్​ మహంతిపై ఓ వ్యక్తి ఫిర్యాదు

హైదరాబాద్​ పోలీస్​ కమిషనరేట2 దక్షిణ మండలం ఇంఛార్జీ డీసీపీ అవినాష్​ మహంతిపై ఫిర్యాదు నమోదైంది. అకారణంగా ముస్లింలను లాఠీతో కొట్టారని ఓ వ్యక్తి బంజారాహిల్స్​ పీఎస్​లో కేసు పెట్టాడు.

డీసీపీ అవినాష్​ మహంతిపై ఓ వ్యక్తి ఫిర్యాదు
డీసీపీ అవినాష్​ మహంతిపై ఓ వ్యక్తి ఫిర్యాదు
author img

By

Published : Jan 12, 2020, 7:12 AM IST

Updated : Jan 12, 2020, 9:08 AM IST

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ దక్షిణ మండలం ఇంఛార్జీ డీసీపీ అవినాష్‌ మహంతిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ నెల 10న ముస్లిం యునైటెడ్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ అనంతరం.. ముస్లింలు ఇంటికి తిరిగి వెళ్తుండగా అవినాష్‌ మహంతి అకారణంగా లాఠీతో కొందరిని కొట్టారని ఆరోపించాడు.

డీసీపీ అవినాష్​ మహంతిపై ఓ వ్యక్తి ఫిర్యాదు

ఆయన కొట్టిన సమయంలో బాధితుల చేతిలో ఉన్న జాతీయ పతాకం కింది పడిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే అతని ఫిర్యాదును బంజారాహిల్స్‌ పోలీసులు స్వీకరించపోనందున... పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌కు విషయం తెలిపాడు. కమిషనర్‌ ఆదేశాలతో పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. కేసు కూడా నమోదు చేసినట్లు సమాచారం.

ఇవీ చూడండి: స్వగృహానికి హన్మకొండ యువతి మృతదేహం

TG_HYD_14_12_COMPLAINT_ON_DCP_AV_3066407 REPORTER:K.SRINIVAS NOTE:టిజి టిక్కర్‌, డెస్క్‌, కు వాట్సప్‌ ద్వారా ఫీడ్‌ వచ్చింది. ( )దక్షిణ మండలం ఇన్‌చార్జి డీసీపీ అవినాష్‌ మహంతిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ నెల 10న ముస్లిం యునైటెడ్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ అనంతరం ముస్లిం సోదరులు ఇంటికి తిరిగి వెళ్తుండగా... అవినాష్‌ మహంతి అకారణంగా లాఠీతో కొందరిని కొట్టారని సయ్యద్‌ అబ్దాహు కషఫ్‌ ఆరోపించాడు. ఆయన కొట్టిన సమయంలో బాధితుల చేతిలో ఉన్న జాతీయ పతాకం కూడా కింది పడిపోయినట్టు కషఫ్‌ పేర్కొన్నాడు. అయితే అతని ఫిర్యాదును బంజారాహిల్స్‌ పోలీసులు స్వీకరించపోవడంతో... పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌కు విషయం తెలిపాడు. దీంతో కమిషనర్‌ ఆదేశాలతో పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. కేసు కూడా నమోదు చేసినట్టు సమాచారం.
Last Updated : Jan 12, 2020, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.