శంషాబాద్‌లో యువ వెటర్నరీ వైద్యురాలి హత్యోదంతంపై నిరసనలు కొనసాగుతున్నాయి. నిందితులను వెంటనే శిక్షించి బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఇవాళ ఉదయం నుంచి కాలనీ ప్రధాన ద్వారం వద్ద స్థానికులు ఆందోళన చేస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీ ప్రధాన ద్వారానికి తాళం వేసి పోలీసులు, మీడియా ప్రతినిధులు లోపలికి రాకుండా అడ్డుకుంటున్నారు. పరామర్శలు కాదు.. న్యాయం చేయండంటూ నినాదాలు చేస్తున్నారు.
బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వెళ్లారు. కానీ, పోలీసులు అయన్ను గేటు లోపలికి అనుమతించలేదు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన బాధాకరమన్నారు. వైద్యురాలి ఆచూకీ కనుక్కోవడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. ఈ అత్యాచార ఘటనకు నిఘా వ్యవస్థ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ‘ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా.. పోలీసులు సరైన సమయంలో స్పందించ లేదన్నారు. కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించే తీరిక కూడా కేసీఆర్‌కు, మంత్రులకు లేకపోవడం బాధాకరమని చెప్పారు. మనిషన్న ప్రతి వ్యక్తి మానవీయ కోణంలో స్పందించాల్సిన అవసరం ఉందని రేవంత్ కోరారు.
ఇదీ చూడండి : అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన... మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు