ETV Bharat / state

'90 ml పేరు మార్చండి... వీటి వల్లే యువత పెడదారి' - 90 ml Movie Case In Hrc

రేపు విడుదల కానున్న 90 ml చిత్రాన్ని నిలిపేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో పిటిషన్​ దాఖలైంది. సినిమా పేరును మార్చాలని  మద్య పాన నిషేధ పోరాట సమితి పిటిషన్ వేసింది.

90 ml చిత్రాన్ని నిలిపేయాలి : మద్య పాన నిషేద పోరాట సమి

author img

By

Published : Dec 5, 2019, 5:39 PM IST

మద్యపానాన్ని ప్రోత్సాహించే విధంగా తీసిన 90 ml సినిమా విడుదలను నిలిపేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో మద్య పాన నిషేధ పోరాట సమితి పిటిషన్ దాఖలు చేసింది. ఇటువంటి చిత్రాల వల్లే యువత పెడదోవపడుతోందని సమితి ప్రధాన కార్యదర్శి సంభశివ గౌడ్ మండిపడ్డారు. ఫలితంగా మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారని పేర్కొన్నారు.

చిత్రంలో మద్యపానన్ని ప్రోత్సహించే సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. సినిమా పేరును సైతం మార్చాలని కోరారు. రేపు చిత్రం విడుదల సందర్భంగా... ఐమాక్స్ థియేటర్ వద్ద శాంతియుతంగా నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించారు.

90 ml చిత్రాన్ని నిలిపేయాలి : మద్య పాన నిషేద పోరాట సమి

ఇవీ చూడండి : రాష్ట్రంలో మద్యపానం నిషేధించాలి: డీకే అరుణ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.