ETV Bharat / state

అంచనాలను అందుకోలేకపోతున్న సీజీఎస్టీ రాబడులు - CGST returns news

తెలంగాణలో కేంద్ర వస్తు సేవల పన్ను- సీజీఎస్టీ రాబడులు అంచనాలను అందుకోలేకపోతున్నాయి. తొలి ఆరు నెలల ఆదాయాన్ని పరిశీలిస్తే పన్ను వసూళ్లపై నీలి నీడలు కమ్ముకున్నాయని చెప్పొచ్చు. ఐజీఎస్టీ, కస్టమ్స్‌ సుంకం రాబడుల్లోనూ.. తగ్గుదల కనిపిస్తున్నట్లు కేంద్ర జీఎస్టీ, కస్టమ్స్ అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి.

సీజీఎస్టీ రాబడులు
author img

By

Published : Nov 13, 2019, 10:10 PM IST

అంచనాలు అందుకోని సీజీఎస్టీ రాబడులు

రాష్ట్రంలో జీఎస్టీ పరిధిలో 4.71 లక్షల మందికి వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉన్నాయి. కేంద్ర జీఎస్టీ పరిధిలో 1.87 లక్షల వ్యాపార, వాణిజ్య సంస్థలు ఉన్నాయి. 2019- 20 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో వీటినుంచి నిర్ధేశించిన లక్ష్యం మేరకు రూ. 9, 949 కోట్లు రావాల్సి ఉండగా 5.93 శాతం తగ్గి రూ.9, 359 కోట్ల రాబడి వచ్చింది. ఇంటిగ్రేటడ్‌ జీఎస్టీ మొదటి ఆరు నెలల్లో లక్ష్యం రూ.1, 615 కోట్లు కాగా 17.22 శాతం తగ్గి రూ.1, 333 కోట్లు మాత్రమే వసూలైంది. కస్టమ్స్‌ సుంకం కింద.. 942 కోట్లు వసూలు కావాల్సి ఉండగా రూ.695 కోట్లు మాత్రమే వచ్చింది. ఇది గతంలో కంటే 26.22 శాతం తక్కువ. సెంట్రల్‌ ఎక్సైజ్‌ రెవెన్యూ కింద మొదటి ఆరు నెలల్లో రూ.157 కోట్లు రావాల్సి ఉండగా 45.86 శాతం మేర తగ్గింది. ఈ సారి రూ.87 కోట్లు మాత్రమే వసూలైనట్లు కేంద్ర జీఎస్టీ అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి.

ఆర్థిక మాంద్యం ప్రభావం...

రాష్ట్రంలో 2017 జూలై 1న జీఎస్టీ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 28 లక్షలు రిటర్నులు దాఖలు కావాల్సి ఉంది. కానీ అక్టోబరు 10 వరకు 75 శాతం అంటే.. 21 లక్షల రిటర్నులు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు సకాలంలో లెక్కలు సమర్పించకపోవడం వల్లే పన్ను రాబడులు భారీగా తగ్గాయని అంచనా వేస్తున్న అధికారులు... ఈ సంఖ్యను పెంచే దిశలో చర్యలు చేపట్టారు. దేశ ఆర్థిక మాంద్యం ప్రభావం కూడా రాబడులపై పడిందని అధికారులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి: మత మార్పిడి, రాజకీయ దాడులు సరికాదు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.