ETV Bharat / state

'తెలంగాణ ఆర్టీసీకి మా అనుమతి లేదు' - tsrtc strike latest news

తెలంగాణ ఆర్టీసీకి చట్టబద్ధత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ ​ఆర్టీసీ విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం తమను కోరలేదని హైకోర్టుకు కేంద్రం తెలిపింది. కేంద్ర సర్కారు అనుమతి లేకుండా టీఎస్​ఆర్టీసీని ఎలా ఏర్పాటు చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. రాష్ట్రంలో సుమారు 5 వేల బస్సుల ప్రైవేటీకరణ అంశంపై ఇవాళ విచారణ జరగనుంది.

'తెలంగాణ ఆర్టీసీకి చట్టబద్ధత లేదు'
author img

By

Published : Nov 8, 2019, 5:23 AM IST

Updated : Nov 8, 2019, 7:33 AM IST

'తెలంగాణ ఆర్టీసీకి చట్టబద్ధత లేదు'

ఆర్టీసీ వ్యవహారం మరో మలుపు తిరిగింది. తెలంగాణ ఆర్టీసీకి తమ అనుమతి లేదని... దానికి చట్టబద్ధతే లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం ఎదుట అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వానికి ఏపీఎస్​ఆర్టీసీలో 33 శాతం వాటా ఉన్నది నిజమేనని.. అయితే అది టీఎస్​ఆర్టీసీకి బదిలీ కావన్నారు. ఏపీఎస్ఆర్టీసీ విభజన ప్రక్రియ పూర్తికానందున... టీఎస్​ఆర్టీసీలో 33 శాతం వాటా ఉందన్న ప్రశ్నే తలెత్తదని కేంద్రం పేర్కొంది.

ఆర్టీసీకి కేంద్రం ఆమోదం లేదు...

ఏపీఎస్​ఆర్టీసీ విభజన కోసం కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరలేదని రాజేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి కేంద్రం ఆమోదం లేదని వాదించారు. ఆస్తులు, అప్పుల విభజన అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వివరించారు. విభజన ప్రక్రియ పూర్తికావడానికి చాలా కాలం పట్టే అవకాశం ఉన్నందున... పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం టీఎస్​ఆర్టీసీ ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ తరఫు న్యాయవాదులు వివరించారు.

విరుద్ధ ప్రకటనులు ఎలా చేస్తారు..?

విభజన ప్రక్రియ పూర్తి కాలేదని ఓసారి.. సొంతగా ఆర్టీసీని ఏర్పాటు చేసుకున్నామని మరోసారి పరస్పర విరుద్ధ ప్రకటనలు ఎలా చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 47ఏ ప్రకారం ఏపీఎస్ఆర్టీసీ విభజనకు కేంద్రం అనుమతి తప్పని సరిగా ఉండాల్సిందేనని హైకోర్టు పేర్కొంది. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండగానే రెండు స్వతంత్ర సంస్థలు ఏర్పాటు చేస్తారా అని ప్రశ్నించింది.

టీఎస్​ఆర్టీసీ చట్టబద్ధతను ఎలా సమర్థించుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో 5వేల బస్సులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రైవేటీకరణ చేస్తున్నారని... తెజస ఉపాధ్యక్షుడు పీఎల్​ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని గురువారమే విచారణ చేపట్టాలని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోరారు. అందుకు సంబంధించి ఇప్పటి వరకు జీవోను ఇవ్వలేదని ఏజీ పేర్కొనగా విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.

ఇవీ చూడండి: ప్రజలు, అధికారుల సమన్వయంతోనే సమస్యల పరిష్కారం

sample description
Last Updated : Nov 8, 2019, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.