ETV Bharat / state

రాష్ట్రంలో మెగా ఫుడ్​ పార్కుల ఏర్పాటుపై కేంద్రం దృష్టి - రాష్ట్రంలో మెగా ఫుడ్​ పార్కుల ఏర్పాటుపై కేంద్రం దృష్టి

రాష్ట్రంలో మెగా ఫుడ్ పార్కుల ఏర్పాటుపై కేంద్రం దృష్టి సారించింది. ఖమ్మం జిల్లాలో ప్రతిష్ఠాత్మక మెగా ఫుడ్ పార్కు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. తాజాగా దానికి అవసరమైన అదనంగా రెండెకరాల విస్తీర్ణం భూమిని బుగ్గపాడు వద్ద కేటాయించింది.

రాష్ట్రంలో మెగా ఫుడ్​ పార్కుల ఏర్పాటుపై కేంద్రం దృష్టి
author img

By

Published : Nov 2, 2019, 12:25 AM IST

రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ విధానం అమల్లోకి రానున్న తరుణంలో... రైతుల పంటలకు మంచి గిట్టుబాటు ధరలు రావడానికి ఎంతో అవకాశం ఉంటుంది. మెగా ఫుడ్ పార్క్ పథకంలో భాగంగా 2018లో నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ - టీఎస్‌ఐఐసీ ప్రతిపాదించింది. దీనికనుగుణంగా రాష్ట్రంలో మెగా ఫుడ్​ పార్కుల ఏర్పాటుపై కేంద్రం దృష్టి సారించింది.

గంధంవారి గూడెంలో బత్తాయి మార్కెట్​

నల్గొండ జిల్లా గంధంవారిగూడెం బత్తాయి మార్కెట్ వద్ద ప్రాథమిక ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు కోసం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సి.పార్థసారధి ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయి బత్తాయి మార్కెట్ ఏర్పాటు కోసం 12 ఎకరాల విస్తీర్ణం అవసరం అవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం... తాజాగా మరో రెండకరాలు అదనంగా కేటాయించింది. నల్గొండ జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే బత్తాయి పంట ద్వారా ఏటా వసూలవుతున్న రూ.4,95,417 మార్కెట్‌ ఫీజు వస్తున్న దృష్ట్యా... ఆ ప్రాంతంలోనే మార్కెట్ ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ శాఖ సంకల్పించింది. బీ2బీలో భాగంగా వర్తకుల అవసరాల రీత్యా ఉత్తమంగా ప్రాథమిక ఆహారోత్పత్తుల తయారీ కేంద్రం నెలకొల్పాలన్నది లక్ష్యం.

2018లో గంధంవారిగూడెం వద్ద బత్తాయి మార్కెట్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆ ప్రాంగణలో రోడ్లు, కల్వర్టులు, వేల ప్లాట్‌ఫాంల నిర్మాణం, విద్యుత్ లైన్లు, ఇతర వసతులు 1.50 కోట్ల వ్యయంతో జరుగుతున్నాయి.

ఇదీ చూడండి: పారిశ్రామిక పార్కు పనులను ప్రారంభించనున్న కేటీఆర్‌

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.