ETV Bharat / state

గచ్చిబౌలిలో గాల్లో ఎగిరిన కారు... లైవ్ విజువల్స్ - accident at Gachibowli Biodiversity

హైదరాబాద్​ గచ్చిబౌలిలో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్​ వంతెన మృత్యుకుహరంగా మారింది. పైవంతెన నుంచి ఓ కారు కింద పడగా... మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

గచ్చిబౌలి కారు ప్రమాదం.. లైవ్ విజువల్స్
author img

By

Published : Nov 23, 2019, 3:24 PM IST

Updated : Nov 23, 2019, 5:35 PM IST

గచ్చిబౌలి కారు ప్రమాదం.. లైవ్ విజువల్స్

గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద కారు ప్రమాదం జరిగింది. పైవంతెన నుంచి కారు కింద పడింది. వాహనం అదుపు తప్పి పైవంతెన నుంచి చెట్టుపై పడి, మరో కారుపై పడింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు.

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ఘటనాస్థలిని సందర్శించారు. ప్రమాదానికి కారణాలపై ఆరా తీశారు. కారు ప్రమాదంలో మృతిచెందిన మహిళ మణికొండకు చెందిన సత్తెమ్మగా గుర్తించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు డ్రైవర్‌తో పాటు మరో మహిళకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో బయోడైవర్సిటీ వంతెన వద్ద వాహనదారులు గుమికూడారు. కారు ప్రమాద తీవ్రత, శబ్ధానికి ఒక్కసారిగా జనం భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అర్థంకాక కాసేపు వణికిపోయారు.

ఇవీ చూడండి: ఎద్దును తప్పించబోయి ప్రమాదం.. 12 మంది దుర్మరణం

Last Updated : Nov 23, 2019, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.