తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె నేటితో 43వ రోజుకు చేరుకుంది. డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరుకాక పోవటంతో తాత్కాలిక సిబ్బందితో అధికారులు బస్సులు నడిపిస్తున్నారు. పూర్తి స్థాయిలో అన్ని బస్సులను విధుల్లోకి తీయడం లేదు. ఈ బస్సులన్నీ డీజిల్ వాహనాలే. ఇన్ని రోజులుగా షెడ్లలో ఉన్నందున బస్సుల ఇంజిన్లలో సాంకేతిక సమస్యలు ఏర్పడే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.
అన్ని బస్సులు నడిపే పరిస్థితి లేదు...
రాష్ట్రంలో ఆర్టీసీకి 8,400 వరకు సొంత బస్సులు ఉన్నాయి. 2,100 వరకు అద్దె బస్సులు ఉన్నాయి. మొత్తం బస్సుల్లో 4,200 నుంచి 4,600 బస్సులు మాత్రమే నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు రోజూవారీగా ప్రకటిస్తున్నారు. ఈ లెక్కన సుమారు నాలుగు వేల వరకు బస్సులను నడిపే పరిస్థితి లేదు.
ఇవీ చూడండి: రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు... ఎక్కడికక్కడ అరెస్టులు..