వివేకా హత్యకేసును తప్పుదారి పట్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. హత్య కేసు దర్యాప్తులో ఇంత ఆలస్యమెందుకని ఆయన మంగళగిరిలో ప్రశ్నించారు. వివేకా హత్యకేసు సీబీఐకి అప్పగించడంలో ఎందుకింత జాప్యం జరుగుతోందని నిలదీశారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె స్వయంగా ... వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిపై అనుమానం ఉందని చెబితే.. వారినెందుకు కస్టడీలోకి తీసుకోవట్లేదని ప్రశ్నించారు. అధికారం ఉందని తెదేపా నేతలను వేధించడం మంచి పద్ధతి కాదని బుద్ధా వెంకన్న అన్నారు. సీఎం జగన్ మడమ తిప్పని నాయకుడైతే వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.
ఇదీ చూడిండి: బ్రిడ్జ్ మ్యాన్: పింఛన్ డబ్బుతో నదిపై వంతెన