ETV Bharat / state

'ఒంటరిగానే పోరాడుతాం... ఎలానైనా గెలుస్తాం' - 'ఒంటిరిగానే పోరాడుతాం... ఎలానైనా గెలుస్తాం'

పురపాలిక ఎన్నికల నగారా మోగటంతో కమలనాథులు క‌స‌ర‌త్తు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో పాగా వేయటానికి నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిన రాష్ట్ర నాయకత్వం... ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించింది.

bjp decide to participate on municipal election on single
'ఒంటరిగానే పోరాడుతాం... ఎలానైనా గెలుస్తాం'
author img

By

Published : Jan 8, 2020, 6:00 AM IST

Updated : Jan 8, 2020, 6:30 AM IST

మున్సిపల్ ఎన్నికలకు భాజపా సన్నద్ధమవుతోంది. అధికార పార్టీ తెరాసకు తామే ప్రత్యామ్నయంగా చెప్పుకుంటున్న కమలనాథులు... ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని అన్ని పురపాలికలు, వార్డుల్లో పోటీకి దిగుతున్నారు. గతంలో ప్రభావం చూపించిన పురపాలికలు, నగరపాలికలతోపాటు బలంగా ఉన్న చోట, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో భాజపా ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణ ప్రాంతాల్లో ఎన్నిక‌ల‌ను ప్రభావితం చేసే అన్ని అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటోంది. పాత, కొత్త నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తే భాజపా విజయదుందుభి మోగించడం ఖాయమని కమలనాథులు భావిస్తున్నారు.
ఒంటరి పోరాటం...
పురపాలిక ఎన్నికల్లో భాజపా ఒంటరి పోరాటానికి సిద్ధమైంది. సీనియర్ నేతలకు మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల కోసం 4నెలలుగా కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ను మినహాయించి... మిగిలిన 15 పార్లమెంట్ స్థానాలను 15 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్‌కు పాత, కొత్త నేతలతో కమిటీ ఏర్పాటు చేసి... ఒక సీనియర్ నేతను పరిశీలకుడిగా నియమించారు. భాజపా ఎంపీలు ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ క్లస్టర్లపై రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది.
గత ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని...
2014లో ఉమ్మడి ఏపీలో జరిగిన పురపాలక ఎన్నికల్లో భువనగిరి, నారాయణపేట, కామారెడ్డి లాంటి మున్సిపాలిటీల్లో కొంతమేర భాజపా ప్రభావం కనిపించింది. గతంలో ప్రభావం చూపించిన మున్సిపాలిటీల్లో కూడా కమలనాథులు దృష్టి సారించారు. రాష్ట్రంలో భాజపా వికసిస్తుందనడానికి నాలుగు ఎంపీ స్థానాలు గెలవడమే తార్కాణమని నేతలు చెబుతూ వస్తున్నారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో తెరాసకు భాజపాయే ప్రత్యామ్నాయని... అధికారంలోకి వస్తామని పదేపదే వల్లెవేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఉనికి చాటుకునేందుకు పెద్ద ఎత్తున వ్యూహ రచనలు చేస్తున్నారు.

'ఒంటరిగానే పోరాడుతాం... ఎలానైనా గెలుస్తాం'
దాని ప్రభావమేమి ఉండదు... దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్​ఆర్​సీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమ ప్రభావం పురపాలిక ఎన్నికలపై ఏ మాత్రం ఉండదని భాజపా నేతలు సమర్థించుకుంటున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు తమకు కలిసివస్తాయని భాజపా విశ్వసిస్తోంది. 2023లో రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని నమ్మకం కలగాలంటే.. మున్సిపల్ ఎన్నికలను ఆయుధంగా మలచుకోవాలని కాషాయదళం నిర్ణయించుకుంది.

కాంగ్రెస్ కంటే ఎక్కువ మున్సిపాలిటీలు గెలిస్తేనే.. రానున్న శాసనసభ ఎన్నికల్లో బలం చేకూరుతుందని నేతలు భావిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తెరాసకు దీటుగా ఫలితాలు తీసుకురావాలని రాష్ట్ర నేతలకు జాతీయ నాయకత్వం ఆదేశించింది. అవసరమైతే ప్రచారానికి కేంద్ర మంత్రులతోపాటు జాతీయ నేతలను పంపిస్తామని చెప్పినట్లు సమాచారం. హుజూర్‌నగర్‌ ఫలితాలు పునరావృతం కాకుండా మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి మూడు నెలలుగా కసరత్తు చేస్తున్న కమలనాథులు... ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు సాధిస్తారో వేచి చూడాలి.

ఇవీ చూడండి: పురపాలిక ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల

TG_HYD_02_08_BJP_MUNCIPOLLS_PKG_3182061 రిపోర్టర్‌: జ్యోతికిరణ్‌ NOTE: ఫైల్‌ విజువల్స్‌ వాడుకోగలరు ( ) మున్సిపల్‌ ఎన్నికల నగారా మోగటంతో.. కమలనాథులు క‌స‌ర‌త్తు ముమ్మరం చేశారు. తెలంగాణలో పాగా వేయటానికి మున్సిపల్ ఎన్నికలను ఆసరాగా తీసుకోవాలని భాజపా భావిస్తోంది. ఇందుకోసం రాష్ర్ట నాయకత్వం ప్రత్యేక కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తోంది. అన్ని మున్సిపాలిటీలతో పాటు.. అన్ని వార్డుల్లోను భాజపా ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించింది..........LOOK VO.1: మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ భాజపా సన్నద్ధమైంది. అధికార తెరాసకు తామే ప్రత్యామ్నయంగా చెప్పుకుంటోన్న కమలనాథులు.. గతంలో ఎన్నడూ లేని విధంగా.. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, వార్డుల్లో పోటీకి దిగుతోంది. గత మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రభావం చూపించిన నగరపాలికలతో పాటు బలంగా ఉన్న చోట, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో భాజపా ప్రత్యేక దృష్టి సారించింది. వివిధ మున్సిపాలిటీల్లో కీల‌కంగా ఉండి ప్రస్తుతం తటస్థంగా ఉన్న.. నేతలు ఇప్పటికే కాషాయ కండువా కప్పుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఎన్నిక‌ల‌ను ప్రభావితం చేసే అన్ని అంశాల‌ను భాజపా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటోంది... ప్రతి ఓటరును కలిసేలా రాష్ర్ట నాయకత్వం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోంది. పాత, కొత్త నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తే భాజపా విజయదుందుభి మోగించడం ఖాయమని కమలనాథులు భావిస్తున్నారు..........SPOT VO.2: మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరి పోరుకు భాజపా సిద్ధమైంది. అందులో భాగంగానే.. పార్టీలోని సీనియర్ నేతలకు మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యతలను అప్పగించింది. పురపాలక ఎన్నికల కోసం నాలుగు నెలలుగా కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. హైద్రాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ ను మినహాయించి.. మిగిలిన 15 పార్లమెంట్ స్థానాలను 15 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్ కు పాత,కొత్త నేతలతో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్‌కు ఒక సీనియర్ నేతను పరిశీలకుడిగా నియమించింది. భాజపా ఎంపీలు ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ క్లస్టర్లపై రాష్ర్ట నాయకత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. 2014లో ఉమ్మడి ఏపీలో జరిగిన పురపాలక ఎన్నికల్లో భువనగిరి, నారాయణపేట, కామారెడ్డి లాంటి మున్సిపాలిటీల్లో కొంతమేర భాజపా ప్రభావం కన్పించింది. గతంలో ప్రభావం చూపించిన మున్సిపాలిటీల్లో కూడా కమలనాథులు ప్రత్యేక సారించారు. తెరాస పట్ల ప్రజల్లో వ్యతిరేకత, భాజపా వికసిస్తుందనడానికి నాలుగు ఎంపీ స్థానాలు గెలవడమే తార్కాణమని చెబుతూ వచ్చింది. రాబోయే శాసన సభ ఎన్నికల్లో తెరాసకు ప్రత్యామ్నాయంగా భాజపా అధికారంలోకి వస్తోందని పదేపదే కమలనాథులు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈ ఎన్నికలు ఎంపీలతో పార్టీకి జీవన్మారణ సమస్యగా మారింది. తెరాసను విమర్శిస్తు వస్తున్న భాజపా రాష్ర్ట నాయకత్వం మున్సిపల్‌ ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకునేందుకు పెద్ద ఎత్తున వ్యూహా రచన చేస్తోంది. VO.3: దేశ వ్యాప్తంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమ ప్రభావం మున్సిపల్ ఎన్నికలపై ఏ మాత్రం ఉండదని భాజపా నేతలు చెబుతున్నారు. పలు రాష్ర్టాల్లో భాజపా గ్రాఫ్‌ పడిపోవడానికి జార్ఖండ్ ఎన్నికల ఫలితాలే అద్ధం పడుతున్నాయని ప్రతిపక్షాల నేతలు పేర్కొంటున్నప్పటికీ... తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధం లేదని తెలంగాణ భాజపా నాయకులు సమర్థించుకుంటున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు తమకు కలసివస్తాయని కమలనాథులు విశ్వసిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో తమకున్న పట్టుతో మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితమైన ప్రభావం చూపాలని కమలనాథులు భావిస్తున్నారు. మరో వైపు ప్రతిపక్ష కాంగ్రెస్ కు అవకాశమివ్వకూడదనే పట్టుదలతో ఉన్నారు. 2023లో తెలంగాణలో అధికారం భాజపాదేనని ప్రజలకు నమ్మకం కలగాలంటే.. మున్సిపల్ ఎన్నికలను ఆయుధంగా మలచుకోవాలని కాషాయదళం నిర్ణయించుకుంది. కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ మున్సిపాలిటీలను గెలిస్తేనే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తిరుగులేని శక్తిగా అవతరిస్తోందని చేస్తున్న ప్రచారానికి బలం చేకూరుతోందని భాజపా నేతలు భావిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తెరాసకు ధీటుగా ఫలితాలు తీసుకురావాలని రాష్ర్ట నేతలకు భాజపా జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఎన్నికల ప్రచారానికి అవసరమైతే కేంద్ర మంత్రులతో పాటు జాతీయ నేతలను పంపిస్తామని చెప్పినట్లు సమాచారం. EVO: పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు భాజపాకు కలిసిరావడంతో తన గళాన్ని పెంచింది. హూజుర్‌నగర్‌ ఉప ఎన్నికల్లోను సత్తా చాటుతామని గర్వంగా చెప్పిన భాజపా నేతలు ఉప ఎన్నిక ఫలితంతో కంగుతిన్నారు. హుజూర్‌నగర్‌ ఫలితాలు పునరావృతం కాకుండా మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి మూడు మాసాలుగా కసరత్తు చేస్తున్న కమలనాథులు ఈ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు సాధిస్తారో వేచి చూడాలి.
Last Updated : Jan 8, 2020, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.