అయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలోని శ్మశాన వాటికలో అయేషా మృతదేహానికి శవపరీక్ష చేస్తున్నారు. దిల్లీ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో రీ పోస్టుమార్టం జరుగుతుంది. సీబీఐ విచారణలో భాగంగా మృతదేహానికి మరోసారి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
అయేషామీరా మృతదేహం వెలికితీసి... ఫోరెన్సిక్ నిపుణులు ఆనవాళ్లు నమోదు చేసుకున్నారు. ఎముకలు, కేశాలు, గోళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధారాలు సేకరించి పూర్తి నివేదిక తయారుచేయనున్నట్లు ఫోరెన్సిక్ బృందం తెలిపింది.
ఇదీ చదవండి :