బ్యాంకు ఏటీఎంల్లో మైక్రో కెమెరాలు, స్కిమ్మర్లు అమర్చి ఖాతాదారుల డెబిట్ కార్డులు క్లోనింగ్ చేస్తున్న ఇద్దరు రొమేనియా దేశస్థులను అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి మైక్రో కెమెరాలు, స్కిమ్మర్లు, కంప్యూటర్లు, పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. రొమేనియా దేశానికి చెందిన దింత విర్‌జిల్, జార్జ్ ఈ తరహా మోసాలకు తెర తీశారు. నిందితులు ఏటీఎంల నుంచి ఖాతాదారుల డాటాను దొంగిలిస్తారు. ఈ సమాచారాన్ని మరో విదేశీయుడికి పంపిస్తారు. అతను కార్డులను క్లోనింగ్ చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.
గుట్టు రట్టైందిలా...
బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చి ఫిర్యాదు చేయగా... రంగంలోకి దిగిన పోలీసులు నిఘా పెట్టారు. సీసీటీవీ దృశ్యాలు, బ్యాంక్ సిబ్బంది సహాయంతో నిందితులను పట్టుకున్నారు. ఇప్పటివరకు ఎంతమందిని మోసం చేశారన్న అంశంపై లోతైన విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. నేరస్థులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందికి సీపీ... నగదు పురస్కారాలు అందజేశారు.
ఇదీ చూడండి: ఎల్లుండి హుజూర్‌నగర్‌లో కృతజ్ఞత సభ: కేసీఆర్