ఆర్టీసీ జేఏసీ బస్ రోకోను అడ్డుకునేందుకు పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడాన్ని కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తప్పుపట్టారు. ఉదయమే హైదరాబాద్ మీర్పేట పరిధిలోని ఉర్మిళా నగర్ కాలనీలో ఆయన అపార్ట్మెంటుకు వచ్చి గృహ నిర్బంధం చేశారు. అప్పటికే పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులు ఆయన ఇంటికి చేరుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ... అశ్వత్థామరెడ్డి ఇంట్లోనే దీక్షకు దిగారు.
ప్రభుత్వం చర్చలకు పిలిచే వరకు తమ దీక్షను కొనసాగిస్తానని తెలిపారు. పోలీసులు తనను బలవంతంగా అరెస్టు చేసినా... పోలీస్ స్టేషన్లోనే దీక్ష కొనసాగిస్తానని తేల్చిచెప్పారు.
ఇవీ చూడండి : బస్ రోకోకు అనుమతి లేదు: సీపీ