ETV Bharat / state

సమ్మెకు సంఘీభావం తెలిపిన ఏపీ ఆర్టీసీ ఐకాస నేతలు - తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 2019 లేటెస్ట్

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఏపీ ఆర్టీసీ ఐకాస నేతలు హైదరాబాద్​లోని ఎంప్లాయిస్ యూనియన్​ కార్యాలయంలో మద్దతు తెలిపారు.

రాష్ట్ర కార్మికుల సమ్మెకు ఏపీ ఆర్టీసీ మద్దతు
author img

By

Published : Oct 29, 2019, 2:59 PM IST

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ఏపీఎస్​ ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు మద్దతు పలికారు. సమ్మె చేస్తున్న కార్మికులకు అండగా ఉంటామని అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం నేత దామోదర్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో టీఎస్‌ఆర్టీసీ ఐకాస నాయకులతో కలిసి ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. సంస్థ పరిరక్షణ, ఉద్యోగ భద్రత కోసం కార్మికులు పోరాడుతున్నారని దమోదర్ తెలిపారు. ఏపీలో ఆర్టీసీని విలీనం చేసేందుకు కమిటీ వేశారని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయదన్నారు. ఆర్టీసీ ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని... ఇతరులకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని టీఎస్ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ థామస్ రెడ్డి ఆరోపించారు. సంస్థకు రావాల్సిన డబ్బులు ఇవ్వలేదని కోర్టుకు వివరించినట్లు అయన పేర్కొన్నారు. రేపు జరిగే బహిరంగసభకు కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సమ్మెకు సంఘీభావం తెలిపిన ఏపీ ఆర్టీసీ ఐకాస నేతలు

ఇదీ చదవండిః 'స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మె కొనసాగిస్తాం'

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.