ETV Bharat / state

అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణకు మరో అవకాశం - అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణకు జలమండలి మరో అవకాశం

హైదరాబాద్‌లో అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణకు జలమండలి మరో అవకాశం కల్పించింది. అక్రమ నల్లా కనెక్షన్లు ఉన్న వారు ఈ నెల 22 నుంచి మూడు నెలల్లోగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.... క్రమబద్ధీకరిచుకోవాలని పిలుపునిచ్చింది. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.

అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణకు మరో అవకాశం
author img

By

Published : Nov 23, 2019, 5:27 AM IST

ఎన్నో వ్యయ ప్రయాసలతో హైదరాబాద్ వాసులకు జలమండలి మంచినీటిని అందిస్తోంది. సుమారు 200 కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి, కృష్ణా జలాలను తీసుకొస్తోంది. ప్రతి వెయ్యి లీటర్లకు రూ. 47 ఖర్చు చేస్తూ... 214 కోట్ల 76 లక్షల లీటర్లతో రోజూ కోటి మందికి పైగా జనాభా దాహార్తిని తీరుస్తోంది. సరఫరా చేస్తున్న నీటిలో 37 శాతం లెక్కలోకి రాకుండా పోతోంది. ప్రజలు నీటి వృథాతో పాటు... కొందరు అక్రమంగా నీటి కనెక్షన్లను ఉపయోగిస్తున్నారు. ఈ వృథా కారణంగా జలమండలికి ప్రతినెలా సుమారు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లుతోంది. దీనికి చెక్‌ పెట్టాలని నిర్ణయించిన జలమండలి.... అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టింది.

వీడీఎస్​ ద్వారా కనెక్షన్..

గతంలో అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తిస్తే.... మూడేళ్ల మంచినీటి బిల్లుతో పాటు రెట్టింపు కనెక్షన్ ఛార్జీలు జరిమానాగా విధించేవారు. కానీ ఎలాంటి జరిమానాలు లేకుండా...స్వయంగా వివరాలు వెల్లడించే పథకం-వీడీఎస్​ ద్వారా నల్లా కనెక్షన్‌ క్రమబద్ధీకరణకు జలమండలి అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 22 నుంచి ఫిబ్రవరి 21 వరకు 90 రోజులపాటు వీడిఎస్​ను అమలు చేయనున్నారు. అక్రమ కనెక్షన్లు ఉన్న యజమానులు జలమండలి వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. క్రమబద్ధీకరణ ఛార్జీలతో పాటు ఒకనెల నల్లా బిల్లు చెల్లిస్తే సరిపోతుందని జలమండలి అధికారులు తెలిపారు.

కఠిన చర్యలు..

గతంలో అధికారులు నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణకు ఎంత ప్రచారం కల్పించినా.. ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఈసారి గడువు ముగిసేలోగా క్రమబద్ధీకరించుకోని వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

ఇదీ చూడండి: 'ఉద్యోగాలు పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా చనిపోతాయి'

TG_HYD_02_23_Tap_Connections_Regularization_Scheme_Pkg_3182301 నోట్ః ఫైల్ షాట్స్ (జల మండలి, నల్లాలు, నీటి వృథా, ప్రజల విజువల్స్) Reporter: Kartheek () హైదరాబాద్ నగరంలో అక్రమ నల్లా కనెక్షన్లను క్రమబద్దీకరణ చేపట్టాలని జలమండలి నిర్ణయించింది. మూడు మాసాల్లోపు అక్రమ నీటి కనెక్షన్లు ఉన్న వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి తమ నల్లా కనెక్షన్ ను క్రమబద్ధీకరిచుకోవాలని పిలుపునిచ్చింది. నిన్నటి నుంచి 2020 ఫిబ్రవరి 21 తేదీ వరకు కనెక్షన్లు పునరుద్దరించుకోవ్చని జల మండలి ఉన్నతాధికారులు పేర్కొన్నారు. లేదంటే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. Look వాయిస్ ఓవర్ః వ్యయప్రయాసలతో హైదరాబాద్ వాసులకు జల మండలి మంచినీటిని అందిస్తోంది. సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలోని గోదావరి, కృష్ణా నదుల నుంచి నీటిని తీసుకుని వస్తోంది. ప్రతి వెయ్యి లీటర్లకు 47 రూపాయలు ఖర్చు చేస్తూ 214 కోట్ల 76 లక్షల లీటర్లను ప్రతిరోజూ నగరంలోని కోటి మందికి పైగా జనాభా దాహార్తిని తీరుస్తున్నారు. అయితే ఇక్కడి వరకు అంతాబాగానే ఉన్నా... సరఫరా చేస్తున్న నీటిలో 37 శాతం లెక్కలోకి రాకుండా పోతోంది. దీంతో జలమండలి భారీగా ఆదాయం కోల్పోతుంది. ప్రజలు నీటిని వృథా చేయడంతో పాటు... కొందరు అక్రమంగా నీటి కనెక్షన్లను ఉపయోగిస్తున్నారని, దీంతోనే నష్టాలు వస్తున్నాయని అధికారులు తేల్చారు. ఈ వృథా నీటి ద్వారా జలమండలికి ప్రతినెల సుమారు 20 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. దీనికి చెక్ పెట్టాలని నిర్ణయించిన జలమండలి ఈ అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్దీకరణకు శ్రీకారం చుట్టింది. వాయిస్ ఓవర్ః గతంలో అక్రమ నల్లా కనెక్షన్ క్రమబద్ధీకరించుకోవడానికి మూడేళ్ల మంచినీటి బిల్లుతో పాటు రెట్టింపు కనెక్షన్ ఛార్జీలు జరిమానా విధించేవారు. ఈ క్రమబద్దీకరణలో ఎలాంటి జరిమానాలు లేకుండా ఒక్క కనెక్షన్ ఛార్జీ... అలాగే ఒక నెలకు బిల్లు చెల్లించి అక్రమ నల్లా కనెక్షన్లను క్రమబద్ధీకరించుకోవచ్చని జలమండలి అధికారులు వెల్లడించారు. క్రమబద్దీకరణ కోసం ప్రజలు తమ సమీపంలోని జలమండలి కార్యాలయ సిబ్బందిని... 155313 నంబర్ కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. మూడు నెలల తరువాత ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్ కలిగి ఉండి క్రమబద్దీకరించుకునేందుకు రెండు రెట్లు కనెక్షన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు మూడేళ్ల వినియోగ ఛార్జీలతో పాటు రూ. 300 సర్వీస్ ఛార్జీలు చెల్లించడంతో పాటు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. ఎండ్....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.