అంబేడ్కర్ సమతా యాత్ర గోడపత్రికను ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. డిసెంబర్ 17న హైదరాబాద్ నుంచి బయలుదేరి... నాగపూర్లోని దీక్ష భూమి వరకు అంబేడ్కర్ సమతా యాత్ర ఉంటుందని ఆయన తెలిపారు. అంబేడ్కర్ సమతా యాత్ర నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
గౌతమ బుద్ధుడి బాటలోనే పయనించిన అంబేడ్కర్ 1956 అక్టోబర్ 14న విజయదశమి సందర్భంగా నాగపూర్లో బౌద్ధ మతాన్ని స్వీకరించారని తెలిపారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం దీక్ష భూమిగా విరాజిల్లుతోందని పేర్కొన్నారు. దీక్షా భూమిలో 18 డిసెంబర్ 2001న అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ బౌద్ధ స్థూపాన్ని ఆవిష్కరించారన్నారు. దేశంలో నిత్యం జరుగుతున్న స్త్రీ పురుష అసమానతలు... అణచివేతలు, సాంఘిక దురాచారాలకు అంబేడ్కర్ సమసమాజ స్థాపన చేశారని పేర్కొన్నారు. యాత్రకు వందలాది వాహనాల్లో వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి కోరారు.
ఇవీ చూడండి : న్యాయం ప్రతీకారంగా మారకూడదు: జస్టిస్ బోబ్డే