సీఏఏను ఉపసంహరించుకోవాలని, ఎన్ఆర్ని రద్దు చేయాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. మీరాలం ఈద్గా నుంచి శాస్త్రిపురం వరకు యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సీఏఏను వ్యతిరేకిస్తూ.. భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో ముస్లింలు జాతీయజెండాలు చేతబూని సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ..బహిరంగ సభ
అనంతరం శాస్త్రిపురంలో ఎన్ఆర్సీ, ఎన్ఆర్పీ, సీఏఏను వ్యతిరేకిస్తూ.. భారీ బహిరంగసభ నిర్వహించారు. ఈ సభలో వివిధ సంఘాల నేతలు, ముస్లిం మతపెద్దలు, మహిళా సంఘాల నాయకులు, వివిధ వర్గాలవారు పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహిస్తున్న వాళ్లకు పలు ముస్లిం సంఘాలు మంచినీళ్లు, అల్పాహారం అందించారు.
జనవరి 25న ముషాయిరా..
జనవరి 25న చార్మినార్ వద్ద ముషాయిరాను ఏర్పాటు చేస్తామని... అర్ధరాత్రి దాటగానే జాతీయజెండాను ఆవిష్కరించి గణతంత్ర్య వేడుకలు జరుపతామన్నారు. ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో అన్ని వర్గాలవారు హాజరుకావాలని అసదుద్దీన్ సూచించారు. జనవరి 30న బాపూఘాట్ వద్ద పెద్దఎత్తున మానవహారం నిర్వహిస్తామన్నారు. ఈ సభకు భారీ ఎత్తున తరలివచ్చిన ముస్లింలకు అసదుద్దీన్ ఒవైసీ కృతజ్ఞతలు తెలిపారు.
పోలీసుల బందోబస్తు..
వాహనాల రాకపోకలకు అంతరాయం తలెత్తకుండా దారి మళ్లించారు. ఆరాంఘర్ నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చే వాహనాలన్నింటిని మెహదీపట్నం, చంద్రాయణగుట్ట మీదుగా దారి మళ్లించారు. టాస్క్‌ఫోర్స్, ప్రత్యేక పోలీసులు, ఎస్ఓటీ, రాపిడ్ యాక్షన్ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ నుంచే కాకుండా... రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన పోలీసులు కూడా బందోబస్తులో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఫిరాయింపుల బెడద.. కాంగ్రెస్ కొత్త పంథా