ETV Bharat / state

'నా భార్యను ఆ నరకం నుంచి భారత్​కు రప్పించండి' - పశ్చిమ గోదావరి జిల్లా క్రైమ్ న్యూస్

గల్ఫ్ దేశమైన మస్కట్​లో ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ నరకం అనుభవిస్తోంది. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉందామని పరాయి దేశం వెళ్లిన ఆ మహిళ... చిత్రహింసలు అనుభవిస్తోంది. కనీసం భోజనం కూడా పెట్టకుండా లైంగికంగా వేధించేవారని బాధితురాలు ఓ వీడియోలో పేర్కొంది. తన భార్యను అక్కడి నుంచి భారత్​కు తిరిగి రప్పించాలని ఆమె భర్త కోరుతున్నాడు.

women suffered in gulf
'నా భార్యను ఆ నరకం నుంచి భారత్​కు రప్పించండి'
author img

By

Published : Feb 9, 2020, 12:37 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం పెద్దపేటకు చెందిన ఓ మహిళకు... ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అదే ప్రాంతానికి చెందిన ఓ ఏజెంట్ గతేడాది గల్ఫ్​కు పంపాడు. ఉపాధి కోసం వెళుతున్న ఆమెను... 2019 జులై 2న దిల్లీ వరకు వెళ్లి విమానమెక్కించాడు భర్త. మొదట కువైట్ అని చెప్పి ఆ తరువాత సదరు మహిళను దుబాయ్​కు పంపించాడు ఆ ఏజెంట్. మరికొందరితో కలిసి అక్కడ ఓ దుబాయ్ సేఠ్​కు ఆమెను విక్రయించాలని చూశాడు. ఆమె ఒప్పుకోని కారణంగా తీవ్రంగా హింసించారు. కొన్ని రోజుల తరువాత ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆమెను ఆ దేశంలోని ఏజెంట్లు మస్కట్​కు​ పంపారు.

'నా భార్యను ఆ నరకం నుంచి భారత్​కు రప్పించండి'

అక్కడా చిత్ర హింసలు

మస్కట్​లో ఓ వృద్ధుడి ఇంటికి బాధితురాలిని పంపగా అక్కడ ఆమెకు వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఆ వృద్ధుడు తన పట్ల సైకోలా ప్రవర్తించేవాడని... బాధితురాలు తమ బంధువులకు పంపిన వీడియోలో తెలిపింది. భోజనం పెట్టకుండా లైంగికంగా వేధించేవాడని తమ కుమారులతో కొరికించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడ కొన్ని రోజుల పాటు కష్టాలు అనుభవించిన ఆ మహిళ... ఓ పాస్టర్ సాయంతో తప్పించుకుని మస్కట్​లోని భారత ఎంబసీకి చేరుకుంది. నాలుగు నెలలుగా అక్కడే ఉంటోంది. ఆమె పాస్​పోర్టును ఏజెంట్లు తీసుకున్న కారణంగా.. భారత్​కు తిరిగి రాలేక అక్కడే ఆశ్రయం పొందుతోంది. ఎంబసీలో ఉన్నప్పటికీ సరైన ఆహారం లేక అవస్థలు పడుతోంది.

సాయం చేయండి

నరకం లాంటి ఆ దేశంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఆమెను తిరిగి భారత్​కు రప్పించాలని బాధితురాలి భర్త, ఆమె తల్లి కోరుతున్నారు. ఏజెంట్లు ఉద్యోగాల పేరుతో భీమవరం, వీరవాసరం తదితర ప్రాంతాలకు చెందిన ఎంతో మంది మహిళలను మోసం చేశారని ఆరోపిస్తున్నారు. తన భార్యతో పాటు మిగిలిన వాళ్లనూ స్వదేశానికి రప్పించాలని కోరుతున్నాడు.

ఇదీ చదవండి: పక్కా ప్రణాళిక.. 8 నెలలు.. 121 ఇళ్లు..!

Intro:రిపోర్టర్: జి .సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం
జిల్లా :పశ్చిమగోదావరి
ఫైల్ నేమ్ :Ap_tpg_41_08_bvm_gulf_cheting_avb_Ap10087
మొబైల్ :9849959923
యాంకర్: ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కొందరు ఏజెంట్ ఏజెంట్ చేతిలో మోస పోవడం తో దేశం కాని దేశంలో దిక్కుతోచని స్థితిలో ఉంటున్నారు. ఉపాధి
చూపిస్తానని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం నుండి పెద్ద పేట కు చెందిన మండలి లలితను స్థానిక ఏజెంట్ 8 నెలల క్రితం గల్ఫ్ పంపించాడు . గత ఏడాది జూలై 2న తన భర్త మండల శ్రీనివాస్ ఉపాధి కోసం వెళుతున్న భార్యను ఢిల్లీ వరకు వెళ్లి విమానమెక్కించి వచ్చాడు. ఆమె
దుబాయ్ వెళ్లిన తర్వాత ఆమెకు సరైన ఉద్యోగం లేక మోసపోయానని ఆమె తెలుసుకుంది. అక్కడ నుంచి ఆమె మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ లోనే గత నాలుగు నెలలుగా ఆశ్రయం పొందుతుంది. ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఆమెను తిరిగి రప్పించాలని బాధితురాలి భర్త మండలి శ్రీనివాస్, ఆమె తల్లి కోరుతున్నారు. ఏజెంట్లు ఉద్యోగాల పేరుతో భీమవరం, వీరవాసరం తదితర ప్రాంతాలకు చెందిన ఎంతో మంది ని మోసం చేశారని తన భార్యతో పాటు మిగిలి న వాళ్లును కూడా ఇండియాకి రపెంచాలని ప్రభుత్వాన్ని, పోలీసుల్ని బాధితులు కోరుతున్నారు.
బైట్స్1 మండలి శ్రీను, మండలి లలిత బాధితురాలి భర్త
2 బాధితురాలి తల్లి

Body:రిపోర్టర్: జి .సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం
జిల్లా :పశ్చిమగోదావరి
ఫైల్ నేమ్ :Ap_tpg_41_08_bvm_gulf_cheting_avb_Ap10087
మొబైల్ :9849959923

Conclusion:రిపోర్టర్: జి .సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం
జిల్లా :పశ్చిమగోదావరి
ఫైల్ నేమ్ :Ap_tpg_41_08_bvm_gulf_cheting_avb_Ap10087
మొబైల్ :9849959923
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.