మహబూబ్‌నగర్ జిల్లా జనంపేట గ్రామానికి చెందిన గంగాధర్ మద్యం మత్తులో ఆదివారం సాయంత్రం హైదరాబాద్ మలక్‌పేటలో టీవీ టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతన్ని కిందికి దింపేందుకు అగ్నిమాపక, జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ సిబ్బందిని తీసుకొచ్చి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
గంగాధర్ టవర్ పైన ఎక్కడ ఉన్నాడో కనుక్కునేందుకు అధికారులు డ్రోన్ కెమెరాలు ఉపయోగించారు. టీవీ టవర్ వద్ద చీకటిగా ఉన్నందున గంగాధర్‌ను కిందకు దింపేందుకు అధికారులకు సుమారు 3 గంటల సమయం పట్టింది.
గంగాధర్‌ను కిందకు దింపిన వెంటనే 108లో ఆస్పత్రికి తరలించి.. పూర్తి స్థాయి దర్యాప్తు చేశారు.
ఇదీ చదవండిః ఈఎస్ఐ కేసులో నేటితో ముగియనున్న నిందితుల కస్టడీ