ఏడేళ్ల చిన్నారిపై 73 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి యత్నించిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్ల గ్రామంలో జరిగింది.
నిన్న సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న బాలికకు చాక్లెట్లు ఇస్తానని మాయమాటలు చెప్పిన నిందితుడు.. పాఠశాల సమీపంలోని పురాతన గ్రంథాలయం భవనంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. స్థానికులు గమనించి వృద్ధుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుణ్ని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
- ఇదీ చూడండి : 24 గంటల్లో అరెస్ట్... 9 రోజుల్లో ఎన్కౌంటర్