ETV Bharat / state

వెలుగులోకి 'దొంగ బాబా' మోసాల చిట్టా.. 50 కోట్లు వసూలు - డ్రీమ్​ బ్రిడ్జ్​ మనీ సర్క్యూలేషన్​ స్కీం

మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో ఓ బురిడి బాబా మోసాల చిట్టా బయటపడింది. ఆధ్యాత్మికత పేరుతో ఓ యువతి నుంచి 2.70 లక్షలు గుంజాడు. అంతేకాక డిగ్రీ కూడా లేని ఈ దొంగ బాబా.. పలు రకాలుగా మొత్తం 50 కోట్లు దండుకున్నాడు. ఇలాంటి బ్లాక్​ షీప్​ బాబాలను నమ్మకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

వెలుగులోకి 'దొంగ బాబా' మోసాల చిట్టా
50 కోట్లు దండుకున్న 'దొంగ బాబా' గిరీశ్​ సింగ్​
author img

By

Published : Dec 18, 2019, 6:20 PM IST

Updated : Dec 18, 2019, 8:25 PM IST

50 కోట్లు దండుకున్న 'దొంగ బాబా' గిరీశ్​ సింగ్​
ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా సూళ్లూరు పేట​కు చెందిన ఈరగపర్తి కుమార్​ గిరీశ్​ సింగ్​ 2002లో డిగ్రీ ఫెయిల్​ అయ్యాడు. విలాసాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించడానికి సూళ్లూరు పేట​లోనే ఓ సాఫ్ట్​వేర్​ కంపెనీ మొదలు పెట్టాడు. అందులో పెట్టుబడి పెట్టిన వారికి కుచ్చుటోపీ పెట్టాడు. అనంతరం డయాబెటిస్ మొక్కల వ్యాపారం పెట్టి.. ఆ మొక్కలు తింటే మధమేహం తగ్గిపోతుందని నమ్మించి అమాయకుల నుంచి లక్షల్లో వసూలు చేశాడు.

మనీ సర్కులేషన్​ పేరుతో గాలం...

తర్వాత మకాం హైదరాబాద్​కు మార్చాడు. ప్రజలను ఆకర్షించి.. వారికి డ్రీమ్ బ్రిడ్జ్ మనీ సర్కులేషన్ పేరుతో ఓ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పాడు. తాను ఓ మొబైల్ యాప్​ను తయారు చేస్తున్నానని.. అమెజాన్ లాంటి సంస్థలా పెద్ద గుర్తింపు వస్తుందని మభ్య పెట్టాడు. అందులో పెట్టుబడులు పెట్టండంటూ అమాయకులను ఆకర్షించి 40 కోట్లను దండుకున్నాడు. ఈ కేసులో జైలుకు వెళ్ళి గత జూన్​లో విడుదల అయ్యాడు.

గిరీశ్​ ఫుడ్​ సర్వీస్​ పేరుతో..

జైలు నుంచి విడుదలై అనంతరం గిరీశ్​ ఫుడ్ సర్వీస్ పేరుతో కొంత మందిని అందులో పెట్టుబడులు పెట్టమని కోరాడు. తనకు హోటల్స్, రెస్టారెంట్లు ఉన్నాయని నమ్మించి.. 10 కోట్లు వసూలు చేసి ఉడాయించాడు. దీనిపై రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.

బాబాగా అవతారం..

ప్రముఖ ఛానెళ్ళలో ఆధ్యాత్మిక ప్రకటనలతో మహిళలను, సామాన్యులను ఆకర్షించాడు. అద్వైత స్పిరుచువల్ రీఛ్​ర్జ్ ఫర్ ఎక్సెలెన్స్ పేరుతో హైదరాబాద్​ ఎస్​ఆర్​ నగర్​లోని మధురానగర్​లో ఆధ్యాత్మికత, మోటివేషనల్ క్లాసులు ప్రారంభించాడు. అతని వద్దకు వచ్చిన ఓ మహిళ నుంచి ఏటీఎం కార్డు తీసుకుని 2.70 లక్షలు డ్రా చేసుకుని తప్పించుకు తిరిగాడు. ఈ విషయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. బురిడీ బాబా గిరీశ్​ను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. నిందితుడిపై నాలుగు పీఎస్​లలో కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.

ఇవీ చూడండి: ద్విచక్రవాహన దొంగ అరెస్ట్

Tg _hyd _61_18_Cheater_baba_arrest_at_srnagar_AB_TS10021 Contributor: V. Raghu ( Sanathnagar...9490402444 ) Script: Razaq Note: ఫీడ్ డెస్క్ వాట్సాప్‌కు వచ్చింది. ( ) డ్రీమ్‌ బ్రిడ్జ్‌ మనీ సర్క్యూలేషన్ స్కీం పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ ఆధ్యాత్మిక బాబాను హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్ పోలీసులు కటకటాలకు పంపారు. అద్వైత స్పిరిచువల్‌ రీచార్జీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ అధినేత బాబా కుమార్‌ గిరీష్ సింగ్ పలువురిని 40కోట్ల వరకు మోసగించాడని సీఐ మురళీకృష్ణ తెలిపారు. ఇతనిపై 4పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని నేరుగా వెళ్లి వారికి ఆధ్యాత్మిక బోధనలు ఇచ్చేవాడని సీఐ తెలిపారు. ఈ క్రమంలోనే డ్రీమ్‌ బ్రిడ్జ్‌ మనీ సర్క్యూలేషన్ స్కీంలో చేర్పించి మోసాలకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 40కోట్ల రూపాయల వరకు బాధితుల నుంచి కాజేశాడన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందిత బాబా కుమార్ గిరిష్ సింగ్ పలు టీవీ ఛానళ్లలో ఆధ్మాత్మిక బోధనలు ఇస్తూ అమాయక ప్రజలను మోసం చేశాడని సీఐ వివరించారు. బైట్: మురళీకృష్ణ, ఎస్ఆర్ నగర్ సీఐ
Last Updated : Dec 18, 2019, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.