తెలంగాణలో దిశ హంతకులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వద్ద న్యాయవాదులు ఆందోళనకు దిగారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో న్యాయవాదులు ధర్నా చేశారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారిని బహిరంగంగా ఉరితీయాలంటూ డిమాండ్ చేశారు. సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే దిశ ప్రాణాలతోనైనా ఉండేదని న్యాయవాదులు చెప్పారు. వర్మ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని కోరారు. పోలీసుల సంస్కరణలు తీసుకురావాలని అన్నారు. కుమార్తెను పోగొట్టుకుని బాధలో ఉంటే తెలంగాణ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదన్నారు.
ఇదీ చూడండి: