భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పురపాలక ఎన్నికలలో తెరాస నాయకులు పలు అక్రమాలకు పాల్పడ్డారని తెరాస తిరుగుబాటు నేత వెంకట్ గౌడ్ ఆరోపించారు. ప్రచారంలో ఇబ్బందులు సృష్టించడమే కాకుండా... నలుగురు గులాబీ పార్టీ అభ్యర్థుల ఓటమి కోసం కుట్రలు చేశారని విమర్శించారు.
తన సతీమణి మడత రమా వెంకట్ గౌడ్ ఛైర్పర్సన్ పదవికి అర్హురాలని... పార్టీ అధిష్ఠానం పరిశీలించాలని అన్నారు. కుదరని పక్షంలో ఆమె రాజీనామా చేస్తారని ప్రకటించారు. ఈ ప్రకటనపై తెరాస అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంకట్ గౌడ్‌తో పాటు ఆయన వర్గాన్ని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది.
ఇవీ చూడండి: మేడారం వచ్చిన భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి: సీఎం కేసీఆర్