భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపోలో బస్సు ప్రమాదానికి గురైంది. టీఎస్ 28జెడ్ 0077 నంబర్ బస్ ఖమ్మం సర్వీస్ ముగించుకొని వచ్చి డిపోలో ఆగింది. ఈ క్రమంలో బస్సు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిక్షణాల్లో తీవ్రమై బస్సు ముందు భాగం దగ్ధమైంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?