ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి మనసు మారేలా చూడాలని ప్రార్థిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్‌లో ఉన్న అమ్మవారి ఆలయంలో మహిళా కార్మికులు పూజలు చేశారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ జడ్పీ ఛైర్పర్సన్ సుహాసినిరెడ్డి పాల్గొని దీపారాధన చేసి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలతో ఆర్టీసీ కార్మికుల్లో అభద్రతాభావాన్ని సృష్టిస్తున్నారని సుహాసినిరెడ్డి విమర్శించారు. కేసీఆర్ నిర్ణయంలో మార్పురావాలని కోరుతూ దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: మా తల్లికి... కన్నబిడ్డలే అమ్మగా మారారు..