ఆదిలాబాద్‌లోని ఇందిరాప్రియదర్శిణి మైదానంలో 5 రోజుల నుంచి హోరాహోరిగా సాగుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఈటీవీ భారత్- ఈనాడు స్పోర్ట్స్ లీగ్ ముగింపు వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. క్రికెట్, ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, చెస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో విజేతలుగా నిల్చిన జట్లకు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ అభిలాషా అభినవ్, ఈనాడు కరీంనగర్ యూనిట్ మేనేజర్ వెంకటేశ్వర్లు బహుమతులను ప్రధానం చేశారు. చదువులతో పాటు విద్యార్థులు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తే విజేతలుగా నిలవడానికి అవకాశం ఉందని అభిలాషా అభినవ్ వ్యాఖ్యానించారు. మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను పైకి తీయడానికి ఈటీవీ భారత్- ఈనాడు చేస్తున్న కృషిని అభిలాషా అభినవ్ అభినందించారు.
ఇవీ చూడండి:తాగుడికి బానిసై... భార్యను కడతేర్చిన భర్త