ETV Bharat / sports

మహిళల ప్రపంచ టెన్నిస్​ ర్యాంకింగ్స్​లో ఒసాకా @ 3

డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టింది యూఎస్‌ ఓపెన్‌ విజేత నవోమి ఒసాకా. ఆరు ర్యాంక్​లు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరుకుంది. ఫైనల్లో ఓడిన అజరెంక(బెలారస్​) తిరిగి టాప్‌-15 అడుగుపెట్టింది. ఆమె 27 నుంచి 14వ ర్యాంక్​కు చేరుకుంది.

osaka wta latest rankings
ప్రపంచ టెన్నిస్​ ర్యాంకింగ్స్​లో ఒసాకా @ 3
author img

By

Published : Sep 15, 2020, 9:19 AM IST

యూఎస్​ ఓపెన్​ మహిళల సింగిల్స్​ విజేత ఒసాకా.. ర్యాంకింగ్స్​లోనూ జోరు చూపించింది. ఇటీవలే మూడో గ్రాండ్​స్లామ్​ను ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. సోమవారం విడుదలైన డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి ఎగబాకింది. తొలి రెండు స్థానాల్లో యాష్​ బార్టీ , సిమోనా హలెప్​ కొనసాగుతున్నారు.

22 ఏళ్ల నవోమి ఒసాకా.. శనివారం జరిగిన యూఎస్​ ఓపెన్​ ఫైనల్లో అజరెంకను ఓడించింది. టైటిల్​తో పాటు ర్యాంకింగ్స్​లోనూ 6 స్థానాలు మెరుగుపర్చుకుంది.

osaka wta latest rankings
యూఎస్‌ ఓపెన్‌ విజేత ఒసాకా

మూడో గ్రాండ్​స్లామ్​ గెలిచిన జపాన్​ స్టార్ ఒసాకా​.. అత్యధిక గ్రాండ్​స్లామ్​లు గెలిచిన జాబితాలోనూ కెర్బర్​తో కలిసి నాలుగో స్థానంలో నిలిచింది. వీరిద్దరి కంటే ముందు సెరెనా విలియమ్స్​, వీనస్​ విలియమ్స్​, కిమ్​ క్లియెస్టర్స్​ మాత్రమే ఉన్నారు.

యూఎస్​ ఓపెన్​ రన్నరప్​గా నిలిచిన బెలారస్​ భామ అజరెంక.. ఏకంగా 13 ర్యాంక్​లు మెరుగుపర్చుకొని 14వ స్థానంలో నిలిచింది. జెన్నిఫర్​ బ్రాడీ(అమెరికా) 16 స్థానాలు మెరుగుపడి.. 25వ ర్యాంక్​లో ఉంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.