భారత క్రీడాకారులు ధోనీ, మేరీకోమ్, మిల్కాసింగ్, మహవీర్ సింగ్(దంగల్)ల జీవితం తెరపై కనువిందు చేయగా.. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. అందుకే ఇటీవల కాలంలో క్రీడాకారులపై బయోపిక్‌ల హవా నడుస్తోంది. త్వరలో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవితచరిత్ర తెరపైకి రానుంది.
తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ నటి కరీనా కపూర్ నటించనుందని సమాచారం. ఇప్పటికే సానియా పాత్రలో పరిణీతి చోప్రా, దీపికా పదుకొణె పేర్లూ పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కరీనాతో చర్చలు జరిపిందని, ఇందుకు కరీనా కూడా సుముఖత చూపిందని తెలుస్తోంది. మరి, సానియా మీర్జాగా.. కరీనా కనిపిస్తుందా, మరొక నటి దర్శనమిస్తుందా? అంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కబోతుందట.