కోనేరు హంపి.. చెస్‌దేశపు యువరాణి - chess rapid
కోనేరు హంపి.. ప్రపంచ చెస్‌లో ఓ సంచలనం. కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించిన హంపి.. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచి ఆటలో అత్యున్నత శిఖరానికి చేరుకుంది. ర్యాపిడ్ చెస్‌లో ప్రపంచంలోనే మేటి క్రీడాకారిణిగా నిలిచింది.
15 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్ హోదా.. అత్యంత పిన్న వయసులో ఆ ఘనత సాధించిన అమ్మాయిగా ప్రపంచ రికార్డు.. పదేళ్ల వయసులో ప్రపంచ యూత్ చెస్‌లో మూడు స్వర్ణాలతో సంచలనం.. ఆపై జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో టైటిల్.. 2600కు పైగా ఎలో రేటింగ్ సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణిగా ఘనత.. ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం.. ఇలా ఆమె ఖాతాలో ఎన్నెన్ని ఘనతలో.
అయితే ఇవన్నీ ఒకెత్తు..! ఇప్పుడు సాధించిన ఘనత మరో ఎత్తు..! పెళ్లి చేసుకుని.. బిడ్డకు తల్లి అయి.. రెండేళ్లకు పైగా ఆటను పక్కన పెట్టేసి.. మరో ప్రపంచంలోకి వెళ్లిన ఆమె.. మళ్లీ చెస్‌లోకి రావడమే ఆశ్చర్యం! వచ్చాక స్వీయ సాధనతో మళ్లీ ఆటలో పతాక స్థాయికి చేరుకుని.. ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారులతో తలపడి ఇన్నేళ్ల కెరీర్లో సాధించని అద్భుత విజయాన్నందుకోవడం.. అది కూడా తనకు అంతగా కలిసిరాని ఫార్మాట్లో ప్రపంచ ఛాంపియన్ కావడం అనూహ్యం. మన చదరంగ బంగారం కోనేరు హంపి గొప్పదనం గురించి ఇంతకంటే ఏం చెప్పాలి.
భారత మహిళల చెస్‌కు కోనేరు హంపిని ముఖచిత్రంగా చెప్పొచ్చు. దేశంలో మహిళల చెస్‌కు సంబంధించి అనేక తొలి విశేషాలు హంపి పేరుతోనే ముడిపడి ఉంటాయి. విశ్వనాథన్ ఆనంద్ దేశంలో చెస్ విప్లవానికి తెర తీస్తే.. ఆ ఒరవడిని అందిపుచ్చుకుంటూ మహిళల చెస్‌లో గొప్ప విజయాలతో తన ప్రత్యేకతను చాటుకుంది హంపి. 1997లో ప్రపంచ యూత్ చెస్‌లో ఒకేసారి అండర్-10, 12, 14 విభాగాల్లో స్వర్ణాలు గెలవడం వల్ల పదేళ్ల హంపి పేరు మార్మోగింది. ఆ తర్వాత దిగ్గజ క్రీడాకారిణి జుడిత్ పోల్గర్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడుతూ అత్యంత పిన్న వయసులో (15 ఏళ్ల 67 రోజులు) గ్రాండ్‌మాస్టరైన మహిళా క్రీడాకారిణిగా 2002లో రికార్డు నెలకొల్పాక హంపి స్థాయి ఏంటో మరోసారి అందరికీ అర్థమైంది. ఆ తర్వాత పుష్కర కాలంలో హంపి ఎన్నో గొప్ప విజయాలందుకుంది. అయితే భారత చెస్ అభిమానులు కోరుకున్నట్లు, విశ్వనాథన్ ఆనంద్ ఆశించినట్లు ప్రపంచ ఛాంపియన్ కాకపోవడం హంపి కెరీర్లో లోటే.
పెళ్లయ్యాక కాంస్యం.. తల్లయ్యాక స్వర్ణం
ఆట ఏదైనా సరే.. మహిళా క్రీడాకారిణులు పెళ్లి చేసుకుంటే వాళ్ల కెరీర్ అయిపోయినట్లే అని భావిస్తారు. అయితే పెళ్లి తర్వాతే హంపి కెరీర్ గొప్ప మలుపు తీసుకోవడం విశేషం. 2014లో దాసరి అన్వేష్‌ను పెళ్లాడిన హంపి.. తర్వాతి ఏడాది ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్‌షిప్ (క్లాసిక్)లో కాంస్యం సాధించింది. అయితే తర్వాతి ఏడాది ఆమె తల్లి కావడం వల్ల చెస్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. రెండేళ్ల పాటు ఆట జోలికే వెళ్లలేదు. తన పాపకు ఏడాది వయసు వచ్చే వరకు ఆమె ఆటను త్యాగం చేసింది. అయితే రెండేళ్ల విరామం తర్వాత నిరుడు ఆటలోకి పునరాగమనం చేసినప్పటికీ.. ఈ విరామం ఆమె లయను దెబ్బ తీసి ఉంటుందేమో.. కెరీర్లో మళ్లీ ఉన్నత స్థితిని అందుకోవడం కష్టమేమో అని చాలామంది సందేహించారు. కానీ హంపి అంచనాల్ని తలకిందులు చేసింది. విదేశాలకు వెళ్లి శిక్షణేమీ తీసుకోకుండా తండ్రి సాయంతో సొంతంగా సాధన చేసి మళ్లీ ఫామ్ అందుకుంది. ఈ ఏడాది ఫిడె మహిళల గ్రాండ్ ప్రి టైటిల్ సొంతం చేసుకుని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో హంపి ఎలాంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగింది. అక్కడ ఆమె పోటీ పడుతున్నట్లు కూడా చెస్ అభిమానులకు తెలియదు. మీడియాలో కూడా ఈ టోర్నీ గురించి హడావుడి లేదు. కానీ టోర్నీలో నిలకడగా విజయాలు సాధించి.. టైబ్రేక్‌లో ఉత్కంఠను అధిగమించి టైటిల్ సొంతం చేసుకుంది.
నచ్చని ఫార్మాట్లో.. అదే చిత్రం
తనకు అంతగా ఆసక్తి లేని, రికార్డు కూడా ఏమంత బాగా లేని ఫార్మాట్లో హంపి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడం చిత్రమే. ఎక్కువ సమయం సాగే క్లాసిక్ ఫార్మాట్ అంటేనే హంపికి ఇష్టం. తక్కువ సమయంలో, వేగంగా సాగే ర్యాపిడ్ గేమ్‌లు ఆడటంలో హంపి ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఆడింది లేదు. ప్రస్తుత టోర్నీలో కూడా టైటిల్ మీద ఆమెకు అసలు ఆశే లేదట. టాప్-3 లక్ష్యంగా మాస్కో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిందట హంపి. అయితే టోర్నీని సానుకూల దృక్పథంతో ఆరంభించడం, టైటిల్ ఫేవరెట్‌గా కనిపించిన లీ టింగ్‌జీ చివరి దశలో తడబడటం కలిసొచ్చి టైటిల్ దిశగా హంపి అడుగులు పడ్డాయి. టైబ్రేక్‌లో ఉత్కంఠను అధిగమించి ఆమె ఛాంపియన్ కాగలిగింది.
"ర్యాపిడ్, బ్లిట్జ్.. రెండూ నేను అంతగా ఇష్టపడే ఫార్మాట్లు కావు. చివరి రోజు మ్యాచ్‌ను ఆరంభించిన తీరు చూశాక టైటిల్ గెలుస్తానని అస్సలు అనుకోలేదు. టైబ్రేక్ ఆడతాననీ ఊహించలేదు. కానీ నాణ్యమైన ఆటతో ప్రపంచ టైటిల్ గెలవడం ఎంతో సంతృప్తినిచ్చింది. నాకంతగా కలిసి రాని ర్యాపిడ్‌లో ప్రపంచ ఛాంపియన్ కావడం నా ఆత్మవిశ్వాసాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుంది."
-హంపి, చెస్ క్రీడాకారిణి
కోనేరు హంపి తండ్రి కోనేరు అశోక్ క్రీడాకారుడు. పాఠశాల స్థాయిలో అనేక ఆటలాడిన ఆయన.. తర్వాత చెస్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. జాతీయ స్థాయిలో చెస్ ఆడాడు. ఆటలంటే అమితమైన ఇష్టం ఉన్న ఆయన తన కూతురికి ఏం పేరు పెడదామా అని ఆలోచించి.. champion అనే పదంలో hampi అక్షరాలు తీసుకుని హంపి అని పేరు పెట్టాడట. తన వారసత్వాన్ని కొనసాగిస్తూ కుమార్తెను చెస్‌లోకి తీసుకొచ్చాడు. ఆమె తండ్రి నమ్మకాన్ని నిలబెడుతూ.. ఈ ఆటలో 'ఛాంపియన్'గా ఎదిగింది. ఇప్పటికే ఎన్నో గొప్ప ఘనతలు సాధించిన ఆమె.. ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి తండ్రి తనకు పెట్టిన పేరుకు సార్థకత చేకూర్చింది.
హంపికి ఇది ఓవరాల్‌గా ఐదో ప్రపంచ పతకం. గతంలో మూడు ప్రపంచ యూత్ స్వర్ణాలు (1997, 1998, 2000) గెలిచిన ఆమె.. 2015లో ప్రపంచ టీమ్ కాంస్యాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ప్రపంచ ర్యాపిడ్ స్వర్ణం హంపి వశమైంది.
ఇవీ చూడండి.. ప్రపంచ ర్యాపిడ్ ఛాంప్ కోనేరు హంపి
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Washington, DC - 25 September 2017
1. Wide shot of news conference with US Congressman John Lewis (centre)
2. Lewis speaking
3. News conference with Lewis speaking
4. Audience
5. Zoom out of Lewis at end of news conference
POOL - AP CLIENTS ONLY
ARCHIVE: Washington, DC - 11 January 2017
6. US senators listening
7. Various of Lewis testifying against the confirmation of Jeff Sessions as attorney general
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Atlanta, Georgia - 21 January 2017
8. Lewis participating in a march against the inauguration of Donald Trump as US president
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Washington, DC - 24 October 2019
9. STILL of Lewis at Elijah Cummings funeral
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Washington, DC - 6 December 2019
10. STILL of Lewis with US House Speaker Nancy Pelosi
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: Washington, DC - 18 December 2019
11. STILL of Lewis speaking as the House of Representatives debates the articles of impeachment against Trump
STORYLINE:
Congressman John Lewis of Georgia announced on Sunday he has stage IV pancreatic cancer, vowing he will stay in office and fight the disease with the tenacity with which he fought racial discrimination and other inequalities dating to the civil rights era.
Lewis, the youngest and last survivor of the Big Six civil rights activists in a group once led by the Reverend Martin Luther King Jr, said in a statement the cancer was detected earlier this month during a routine medical visit.
He said subsequent tests confirmed the diagnosis of stage IV pancreatic cancer.
"I have been in some kind of fight — for freedom, equality, basic human rights — for nearly my entire life. I have never faced a fight quite like the one I have now," said Lewis, 79.
His statement added: "While I am clear-eyed about the prognosis, doctors have told me that recent medical advances have made this type of cancer treatable in many cases, that treatment options are no longer as debilitating as they once were, and that I have a fighting chance.″
Lewis added that he decided he will return to the nation's capital in coming days to continue his work and begin his treatment plan.
He said medical treatment will be ongoing over the next several weeks but he did not elaborate on the specifics of the treatment or the cancer itself.
An Atlanta Democrat sometimes called the "conscience of the Congress," Lewis is known for the prominent role he had in the 1960s civil rights struggles.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.