ETV Bharat / sports

ఒలింపిక్స్​లో స్వర్ణమే నా లక్ష్యం: సుశీల్​ - సుశీల్​కుమార్​

2008, 12 విశ్వక్రీడల్లో భారత్ తరపున పతకాలు గెలిచిన సుశీల్ కుమార్ వచ్చే టోక్యో ఒలింపిక్స్​కు​ సిద్ధమవుతున్నాడు. ఒలింపిక్స్​లో స్వర్ణం నెగ్గడమే లక్ష్యమని ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖిలో తెలిపాడు.

సుశీల్ కుమార్
author img

By

Published : Oct 27, 2019, 11:34 AM IST

ఒలింపిక్స్​లో స్వర్ణమే నా లక్ష్యం: సుశీల్​

ఒలింపిక్స్​లో​ రెండు సార్లు పతకాలు సాధించి.. మరోసారి విశ్వ క్రీడల్లో సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నాడు భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్. 2008 బీజింగ్ ఒలింపిక్స్​లో కాంస్యం... 2012 లండన్ విశ్వక్రీడల్లో రజతం కైవసం చేసుకున్నాడు. ఇవి కాకుండా 2014, 18 కామన్​వెల్త్​ క్రీడల్లోనూ పసిడి సొంతం చేసుకున్న ఈ స్టార్ రెజ్లర్​తో ఈటీవీ భారత్ ప్రత్యేకంగా మాట్లాడింది. ఆ విశేషాలు సుశీల్​ మాటల్లోనే...

అందరూ సిద్ధంగా ఉన్నారు..

భారత్​లో రెజ్లింగ్​.. రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. చాలామంది ఈ క్రీడపై ఆసక్తి చూపిస్తున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్​ కోసం రెజ్లర్లు ఇప్పటికే సన్నాహకాలు మొదలు పెట్టేశారు. అందరూ ఇందుకోసం సిద్ధంగా ఉన్నారు.

8 ఏళ్ల తర్వాత ఆడా..

ఇటీవల ప్రపంచ రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​లో ఆడా. ఈ టోర్నీలో 8ఏళ్ల విరామం తర్వాత పాల్గొన్నా. ఆ అనుభవం విభిన్నంగా ఉంది. అక్కడ చేసిన తప్పిదాలను నా కోచ్ గమనించాడు. అవి పునరావృతం కాకుండా కష్టపడుతున్నా. భవిష్యత్తులో ఇవి నాకు ఉపయోగపడతాయి.

తీవ్రంగా శ్రమిస్తున్నా..

ఒలింపిక్స్​లో స్వర్ణం నెగ్గడమే నా లక్ష్యం. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నా. ఎవరు.. ఎంత సేపు ప్రాక్టీస్ చేయాలనేదానిపై నా కోచ్ ప్రణాళిక రూపొందిస్తాడు. ఆ ప్రకారం రోజుకు 45 నిమిషాల నుంచి 2 గంటల పాటు కష్టపడుతున్నా. ఆటలో యాక్టివ్​గా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది.

Exclusive Interview: Sushil Kumar opens up about preparations for Tokyo 2020
సుశీల్ కుమార్

ఒలింపిక్స్ అర్హత​లో ఫెడరేషన్​దే అంతిమ నిర్ణయం..

మేరీ కోమ్​, నిఖత్ జరీన్ వివాదంలో ఫెడరేషనే నిర్ణయం తీసుకుంటుంది. మీరు, నేను ఎంపిక చేసేందుకు వీలుండదు. ఎందుకంటే ఫెడరేషన్ స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ. భారత్​ తరపున ఎవరు అత్యుత్తమంగా ఆడతారు, ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది అనే వాటిపై ఫెడరేషన్​కు అవగాహన ఉంది.

ఇదీ చదవండి: 'మేరీనే తీసుకోవాలనుకుంటే నేనెందుకు ఆడడం'

నాతో పాటు వాళ్లూ గెలుస్తారు..

2020 టోక్యో ఒలింపిక్స్​లో నాతో పాటు దీపక్ పునియా, బజరంగ్ పునియా, వినీశ్ ఫొగాట్, రవి దాహియా పతకాలు సాధిస్తారని అనుకుంటున్నా.

పహిల్వాన్ అంటే నెయ్యి తినాల్సిందే..

కుస్తీలో ఫిట్​గా ఉండాలంటే నెయ్యి తినాల్సిందే. నేను ఇప్పటికీ నా ఆహారంలో భాగంగా తీసుకుంటున్నా. మా గురువు బాబా రామ్​దేవ్​ కూడా తినమని నాకు సలహా ఇచ్చారు.

2008, 2012 క్రీడల్లో 66 కేజీల విభాగంలో తలపడిన సుశీల్ కుమార్ అనంతరం 74 కేజీలకు మారాడు. 2016 రియో ఒలింపిక్స్​లో ఆడకపోవడానికి ఇది కూడా ఓ కారణం. ఆ విభాగంలో ఇంతకుముందే ఉన్న నర్సింగ్ యాదవ్ పోటీకి సిద్ధంగా ఉండగా.. కోర్టు ఆదేశంతో రియో ఒలింపిక్స్​కు దూరమయ్యాడు సుశీల్​.

ఇదీ చదవండి: ఫెదరర్ కొత్త రికార్డ్​... ఈ సీజన్​లో హాఫ్​ సెంచరీ

AP Video Delivery Log - 0300 GMT News
Sunday, 27 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0219: US Wildfires AP Clients Only 4236858
Blackouts begin as winds build in California
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.